ఆ నాణేలు చెల్లుబాటు అవుతాయా ?? RBI క్లారిటీ
భారత కరెన్సీలో కొన్ని నాణేలు క్రమేపీ కనుమరుగైపోతున్నాయి. 25 పైసలనుంచి నాణేలు అందుబాటులో ఉండగా.. 25పైసలు, 50 పైసల నాణేలు దాదాపు ఎవరూ వినియోగించడంలేదు. ఇక రూపాయి నాణేలు కూడా అడపాదడపా తప్ప పెద్దగా వినియోగించడంలేదు. ప్రస్తుతం 5 రూపాయలు, 10 రూపాయల నాణేలు వినియోగంలో ఉన్నాయి.
భారత కరెన్సీలో కొన్ని నాణేలు క్రమేపీ కనుమరుగైపోతున్నాయి. 25 పైసలనుంచి నాణేలు అందుబాటులో ఉండగా.. 25పైసలు, 50 పైసల నాణేలు దాదాపు ఎవరూ వినియోగించడంలేదు. ఇక రూపాయి నాణేలు కూడా అడపాదడపా తప్ప పెద్దగా వినియోగించడంలేదు. ప్రస్తుతం 5 రూపాయలు, 10 రూపాయల నాణేలు వినియోగంలో ఉన్నాయి. ఇటీవల చానాళ్లు 10 రూపాయల నాణేలు కూడా చెల్లుబాటుకావని దుకాణాల్లో తీసుకునేవారు కాదు. కానీ దీనిపై ఆర్బీఐ క్లారిటీ ఇచ్చిన తర్వాత తిరిగి వాటిని వియోగిస్తున్నారు. ఈ క్రమంలో 50 పైసల నాణేంతో సహా వివిధ విలువలు కలిగిన నాణేలు, నోట్లు చలామణిలో ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. నకిలీ నోట్ల గుర్తింపు, కరెన్సీకి సంబంధించిన అపోహల గురించి ప్రజలకు ఆర్బీఐ ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ ఉంటుంది. తాజాగా, నాణేలపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా వాట్సాప్ ద్వారా వ్యక్తిగత సందేశాలు పంపుతోంది. నాణేలపై అవగాహన కల్పిస్తూ ఒక వీడియోను రూపొందించింది. ఆర్బీఐ వీడియో ప్రకారం, ఒక కొనుగోలుదారు రూ.10 నాణేన్ని తీసుకువస్తే, దుకాణదారు అది చెల్లదని చెబుతాడు. అయితే ఆ నాణేలు చెల్లుబాటు అవుతాయని కొనుగోలుదారుడు దుకాణదారుకు సమాధానమిస్తాడు. చివరగా, అన్నీ నాణేలు చెల్లుబాటు అవుతాయని రూ.10 నాణేంతో మాట్లాడిస్తున్నట్లుగా ఈ వీడియో ఉంటుంది. నాణేలు వేర్వేరు డిజైన్‌లతో ఉన్నప్పటికీ అవన్నీ చలామణిలో ఉన్నాయని ఆర్బీఐ ఈ వీడియో ద్వారా స్పష్టం చేసింది. 50 పైసలు, రూ.1, రూ.2, రూ.5, రూ.10, రూ.20 నాణేలు అన్నీ చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ తెలిపింది. నాణేల గురించి తప్పుదోవ పట్టించే సమాచారం, వదంతులను నమ్మవద్దని సూచించింది. వ్యాపారులు కూడా సంకోచించకుండా ప్రజల నుంచి నాణేలను స్వీకరించాలని ఆర్బీఐ విజ్ఞప్తి చేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
షాకిస్తున్న కొత్త ఆదాయ పన్ను రూల్స్ !! ఇక వీరికి దబిడి దిబిడే
12 గంటల ప్రయాణం ఇక 5 గంటల్లోనే.. అబ్బా సాయి రామ్
ఫ్రీ గ్యాస్ కనెక్షన్.. ఇలా దరఖాస్తు చేసుకోండి !!
ప్రభుత్వం కొత్త యాప్.. రైతు బజార్ నుంచి ఇంటికే కూరగాయలు
జూ నుంచి తప్పించుకున్న సింహం.. ఎప్పుడొచ్చి మీద పడుతుందో.. టెన్షన్.. టెన్షన్..