Video: రూ.20కే 100 కిలోమీటర్ల మైలేజ్! ధర చూస్తే షాక్
ఇప్పుడంతా ఎలక్ట్రిక్ వెహికిల్స్ యుగం నడుస్తోంది. స్కూటర్ల నుంచి కార్లు, బస్సుల వరకు అంతా ఈవీ వెహికిల్స్ రోడ్ల మీద చక్కర్లు కొడుతున్నాయి. పెట్రోల్, డీజిల్ వాహనాలతో పోల్చుకుంటే మెయింటెనెన్స్ సగానికి సగం తగ్గిపోవడంతో అంతా ఈవీ వెహికిల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు.
ఓలా గిగ్ స్కూటర్ మార్కెట్‌ను షేక్ చేస్తోంది. ఈ స్కూటర్ ప్రధానంగా B2B డెలివరీ, రైడ్-షేరింగ్ ఉద్దేశ్యాల కోసం రూపొందించారు. తక్కువ ధరలో, అద్భుతమైన ఫీచర్లతో వస్తుంది. ఓలా గిగ్ ధర రూ.39,999 నుంచి ప్రారంభమవుతుంది. అత్యంత చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటిగా నిలుస్తోంది. ఓలా గిగ్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. అవి గిగ్, గిగ్ ప్లస్. గిగ్ స్టాండర్డ్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.39,999, గిగ్ ప్లస్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 49,999. ఢిల్లీలో గిగ్ ఆన్-రోడ్ ధర రూ.33,906గా ఉంది, ఇందులో RTO, ఇన్సూరెన్స్ ఛార్జీలు కలిపి ఉన్నాయి. ఈ స్కూటర్ ధరలు… డెలివరీ, రైడ్-షేరింగ్ వ్యాపారాలకు ఆకర్షణీయమైన ఆప్షన్‌గా ఉన్నాయి. ఎందుకంటే ఇవి సంప్రదాయ పెట్రోల్ స్కూటర్ల కంటే 93.4% ఎక్కువ డబ్బు ఆదా చేస్తాయని ఓలా తెలిపింది. ఓలా గిగ్ స్కూటర్ బ్యాటరీ సుమారు 4 గంటల్లో 0 నుంచి 80% ఛార్జింగ్ అవుతుంది. ఓలా గిగ్ ఒకే ఒక 1.5 kWh బ్యాటరీతో 112 కిలోమీటర్ల IDC రేంజ్ మైలేజ్‌ను అందిస్తుంది. అయితే గిగ్ ప్లస్‌లో రెండు 1.5 kWh బ్యాటరీలు ఉంటాయి. ఇవి రెండూ కలిపి 157 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తాయి. ఈ స్కూటర్‌లు తక్కువ బరువుతో ఉంటాయి. బ్యాటరీలు త్వరగా ఛార్జ్ అవుతాయి. ఇవి రోజువారీ డెలివరీ అవసరాలకు అనువైనవి. గిగ్ స్కూటర్ మాగ్జిమం వేగం గంటకు 25 కిలోమీటర్లు. గిగ్ ప్లస్ గంటకు మాగ్జిమం 45 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఇవి సురక్షితమైన, సమర్థమైన రైడింగ్‌ను ఇస్తాయి.
