షాకిస్తున్న కొత్త ఆదాయ పన్ను రూల్స్‌ !! ఇక వీరికి దబిడి దిబిడే

Updated on: Dec 11, 2025 | 1:57 PM

ఆదాయపు పన్ను శాఖ లెక్కల్లో చూపని నగదుపై కఠిన నిబంధనలు ప్రకటించింది. ఇంట్లో దొరికిన లెక్కలేని డబ్బుపై 84% వరకు పన్ను విధిస్తారు. పెద్ద మొత్తంలో జరిగే నగదు లావాదేవీలను ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తోంది. బ్లాక్ మనీని నియంత్రించడమే లక్ష్యంగా తెచ్చిన ఈ కొత్త రూల్స్‌తో ప్రతి రూపాయికి లెక్క చూపడం తప్పనిసరి. జాగ్రత్తగా ఉండండి!

ఇంట్లో డబ్బు దాచుకునే వారికి ఐటీ శాఖ కొత్త రూల్స్‌ గట్టి షాకిస్తున్నాయి. లెక్కల్లో చూపని క్యాష్‌ ఇంట్లో దొరికితే ఇక నుంచీ భారీ మూల్యం చెల్లించాల్సిందే. ఇంట్లో ‘లెక్క చూపని డబ్బు’ దొరికితే.. దానిపై ఏకంగా 84% పన్ను విధిస్తారు. డిజిటల్ చెల్లింపుల వాడకం పెరిగాక ప్రభుత్వం దగ్గర ఇప్పుడు ప్రజలకు సంబంధించిన డబ్బు లావాదేవీలకు సంబంధించిన డేటా ట్రాకింగ్ ఈజీ అయినట్లు నిపుణులు అంటున్నారు. పెద్ద మనీ ట్రాన్సాక్షన్స్ గురించి ఆదాయపు పన్ను శాఖకు ఆటోమేటిక్‌గా సమాచారం అందుతుంది. ఈ విషయం చాలా మందికి అస్సలు తెలియదు. తమను ఎవ్వరూ గుర్తించటం లేదని, తాము చేసే పనులు తెలియవని అనుకుంటుంటారు. ఒక ఆర్థిక సంవత్సరంలో ఓ వ్యక్తి రూ.10 లక్షల కంటే ఎక్కువ క్యాష్‌ విత్‌డ్రా చేస్తే.. బ్యాంక్ ఆ వివరాలను ఐటీ కి తెలియచేస్తుంది. విత్‌డ్రా చేసిన మొత్తం రూ.20 లక్షలు దాటితే, ఆ మొత్తంపై టీడీఎస్ కట్ అవుతుంది. పదేపదే పెద్ద మొత్తంలో క్యాష్‌ విత్‌డ్రా చేస్తున్నట్లయితే.. ఆ డబ్బుకు ఇన్‌కమ్ సోర్స్ చూపకపోతే.. ఐటీ శాఖ సోదాలు చేసి యాక్షన్‌ తీసుకునే అవకాశం ఉంది. ఒక రోజులో ఒకే కస్టమర్ నుంచి రూ.2 లక్షల కంటే ఎక్కువ క్యాష్‌ స్వీకరించడం, క్యాష్‌ రూపంలో అప్పు తీసుకోవడం, ఆస్తి అమ్మినప్పుడు 20 వేల కంటే ఎక్కువ డబ్బును స్వీకరించడంపై ఆదాయపు పన్ను శాఖ 100% పెనాల్టీ విధిస్తోంది. అంటే మొత్తం కలిపి అసలు మొత్తానికి రెట్టింపు చెల్లించాల్సి రావచ్చు. దేశంలో బ్లాక్ మనీ, లెక్కల్లో చూపని డబ్బు, ఆస్తులపై ప్రభుత్వం చేస్తున్న పోరాటంలో భాగంగా ఈ రూల్స్‌ కఠినంగా మారాయి. బ్యాంకులు, రిజిస్ట్రార్లు, పన్ను అధికారుల మధ్య డేటా షేరింగ్ మెరుగైంది. ప్రజలు చేస్తున్న ప్రతి లావాదేవీపై నిఘా పెరిగింది. వ్యాపారులు సైతం తమ వద్ద ఉన్న ప్రతి పైసాకు డాక్యుమెంట్స్ చూపించాల్సిందే. లేదంటే ఆర్థికంగా నష్టపోవడం ఖాయం. మీ ఇంట్లో ఉన్న క్యాష్‌ గురించి జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చిందని ప్రతి భారతీయుడూ గుర్తుంచుకోవాలి. ప్రతి రూపాయికీ లెక్క ఉండాలి అప్పుడే చిక్కుల్లో పడకుండా ఉంటారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

12 గంటల ప్రయాణం ఇక 5 గంటల్లోనే.. అబ్బా సాయి రామ్

ఫ్రీ గ్యాస్ కనెక్షన్.. ఇలా దరఖాస్తు చేసుకోండి !!

ప్రభుత్వం కొత్త యాప్.. రైతు బజార్‌ నుంచి ఇంటికే కూరగాయలు

జూ నుంచి తప్పించుకున్న సింహం.. ఎప్పుడొచ్చి మీద పడుతుందో.. టెన్షన్‌.. టెన్షన్‌..

ప్రపంచంలోనే అత్యంత పొట్టి బర్రె మనదే.. గిన్నిస్‌లోకి 3 అడుగుల రాధ