Meeseva: సామాన్యుడిపై ‘మీ సేవ’ భారం.. 50% చార్జీలు పెంపు

Updated on: Apr 03, 2026 | 4:13 PM

తెలంగాణ రాష్ట్రంలోని మీసేవ కేంద్రాల ద్వారా పొందే పౌర సేవల చార్జీలను ప్రభుత్వం భారీగా పెంచింది. తక్షణమే పెంచిన ఛార్జీలను ఏప్రిల్‌ 1, బుధవారం అమల్లోకి తీసుకువచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. కేవలం సేవా రుసుములే కాకుండా, వీటికి అదనంగా 18 శాతం జీఎస్టీ కూడా తోడవడంతో సామాన్యులు, విద్యార్థులపై దాదాపు 77 నుండి 78 శాతం వరకు అదనపు భారం పడనుంది.

తెలంగాణ రాష్ట్రంలోని మీసేవ కేంద్రాల ద్వారా పొందే పౌర సేవల చార్జీలను ప్రభుత్వం భారీగా పెంచింది. తక్షణమే పెంచిన ఛార్జీలను ఏప్రిల్‌ 1, బుధవారం అమల్లోకి తీసుకువచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. కేవలం సేవా రుసుములే కాకుండా, వీటికి అదనంగా 18 శాతం జీఎస్టీ కూడా తోడవడంతో సామాన్యులు, విద్యార్థులపై దాదాపు 77 నుండి 78 శాతం వరకు అదనపు భారం పడనుంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం సేవలను రెండు కేటగిరీలుగా విభజించారు. కేటగిరీ-ఏ లోని అదనపు ధ్రువీకరణలు అవసరం లేని సేవల చార్జీ రూ.35 నుండి రూ.62కి పెరిగింది. కేటగిరీ-బీలో విచారణ అవసరమయ్యే సేవలు అంటే కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు వంటి వాటిపై చార్జీ రూ.45 నుండి రూ.80కి చేరింది.అలాగే దరఖాస్తు సమయంలో 4 పేజీల కంటే ఎక్కువ స్కాన్ చేయాల్సి వస్తే, ప్రతి అదనపు పేజీకి గతంలో రూ.2 ఉండగా, ఇప్పుడు రూ.2.50 వసూలు చేయనున్నారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత మీసేవ నిర్వాహకుల కమీషన్ గణనీయంగా పెరిగింది. కేటగిరీ-ఏపై గతంలో రూ.13 ఉండగా, ఇప్పుడు అది రూ.40.34కి చేరింది. అయితే, స్కాలర్‌షిప్ దరఖాస్తుల కోసం విద్యార్థులు చేసుకునే ఆధార్ ధ్రువీకరణ ఫీజు కూడా రూ.20 నుండి రూ.35కి పెరగడం గమనార్హం. ప్రభుత్వం నిర్ణయించిన చార్జీల కంటే ఎవరైనా అదనంగా వసూలు చేస్తే 1100 లేదా 1800 425 1110 నంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని అధికారులు సూచించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ధురంధర్‌2ను తట్టుకుని.. బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్న హాలీవుడ్ మూవీ

కిరాణా వ్యాపారికి ఫోన్‌ పే పేరుతో కుచ్చుటోపీ.. ఏం జరిగిందంటే

ఎవరేమనుకున్నా.. ఈ ఎన్నికల్లో నా సపోర్ట్‌ విజయ్‌కే

రోజా కూతురికి అరుదైన గౌరవం.. వావ్ !! గ్రేట్ అఛీవ్‌మెంట్ ఇది

Ram Charan: హీరో చెప్పినా నమ్మకుంటే ఎలా ?? ఆలస్యం కాదు

Follow Us