బిగ్‌ అలర్ట్‌ వంట గ్యాస్ సబ్సిడీ కావాలా? అయితే ఇది తప్పనిసరి

Updated on: Nov 01, 2025 | 11:50 AM

ఎల్‌పీజీ గ్యాస్‌ వినియోగదారులకు బిగ్‌ అలర్ట్‌. వంటగ్యాస్‌ వినియోగదారులకు కేంద్రప్రభుత్వం కీలక నిబంధన విధించింది. మీరు ఇంటి అవసరాలకు ఉపయోగించే గ్యాస్‌ సిలిండర్‌పై సబ్సిడీ పొందాలటే తప్పనిసరిగా ఆధార్‌ బయోమెట్రిక్‌ ఈ-కేవైసీని పూర్తిచేయాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా, ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద లబ్ధి పొందుతున్న వారు ప్రతి సంవత్సరం మార్చి 31వ తేదీలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

ఎల్‌పీజీ గ్యాస్‌ వినియోగదారులకు బిగ్‌ అలర్ట్‌. వంటగ్యాస్‌ వినియోగదారులకు కేంద్రప్రభుత్వం కీలక నిబంధన విధించింది. మీరు ఇంటి అవసరాలకు ఉపయోగించే గ్యాస్‌ సిలిండర్‌పై సబ్సిడీ పొందాలటే తప్పనిసరిగా ఆధార్‌ బయోమెట్రిక్‌ ఈ-కేవైసీని పూర్తిచేయాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా, ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద లబ్ధి పొందుతున్న వారు ప్రతి సంవత్సరం మార్చి 31వ తేదీలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. గడువులోగా ఈ-కేవైసీ చేయని వారికి సబ్సిడీని నిలిపివేసి, ఆ ఏడాదికి సంబంధించిన రాయితీని శాశ్వతంగా రద్దు చేస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇండియన్ ఆయిల్ , భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ఆయిల్ కంపెనీలు తమ డిస్ట్రిబ్యూటర్లకు లక్ష్యాలు నిర్దేశించి ఈ-కేవైసీ ప్రక్రియను వేగవంతం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.5 కోట్ల మంది గృహ గ్యాస్ వినియోగదారులు ఉండగా, ఇప్పటివరకు కేవలం 60 శాతం మంది మాత్రమే ఈ-కేవైసీ పూర్తిచేశారు. అయితే, సబ్సిడీ నిలిచిపోయినా, గ్యాస్ సిలిండర్ల సరఫరా, రీఫిల్ బుకింగ్‌కు ఎలాంటి ఆటంకం ఉండదని తెలిపారు. కానీ, వినియోగదారులు పూర్తి ధర చెల్లించి సిలిండర్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుందని కంపెనీలు తమ ఉత్తర్వుల్లో పేర్కొన్నాయి. వినియోగదారుల సౌలభ్యం కోసం వివిధ మార్గాల్లో ఈ-కేవైసీ పూర్తిచేసే అవకాశం కల్పించారు. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి మొబైల్ యాప్ ద్వారా ఈకేవైసీ పూర్తిచేయవచ్చు. అలాగే సమీపంలోని గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీకి వెళ్లి గానీ, లేదా సిలిండర్ డెలివరీ చేసే సిబ్బంది వద్ద కూడా బయోమెట్రిక్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఇన్ని సదుపాయాలు కల్పించినా వినియోగదారుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదని పంపిణీదారులు వాపోతున్నారు. సబ్సిడీ ప్రయోజనాలను నిరంతరాయంగా పొందాలంటే వినియోగదారులు గడువులోగా ఈ-కేవైసీని పూర్తి చేసుకోవడం తప్పనిసరి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కాలర్ ఐడీ వచ్చేస్తోంది ఇక ఫేక్ కాల్స్‌కు చెక్

కారు సైడ్ మిర్రర్‌కు డాష్ ఇచ్చాడని.. కక్షతో బైకర్‌ను వెంబడించి మరీ..

ఆకాశంలో వింత కాంతులు.. అసలు విషయం తెలిసి ఆశ్చర్యం

ప్రియుడి పైశాచికత్వం.. పోలీసులకు చెబితే యాసిడ్ పోస్తా

ఈమె పోలీసు ఆఫీసరే కాదు.. ఖతర్నాక్‌ దొంగ కూడా