బిగ్ అలెర్ట్.. మీ పాన్ కార్డ్ తో ఆధార్ లింక్ అయి ఉందా ??
ప్రస్తుతం పాన్ కార్డు ప్రతి ఒక్కరి జీవితంలో ఆధార్‌లాగా ముఖ్యమైన భాగమైపోయింది. బ్యాంకు ఖాతా నుంచి వివిధ లావాదేవీలను నిర్వహించాలంటే.. ఇది తప్పనిసరి. ఇంకా పన్ను చెల్లింపుదారులకూ పాన్‌కార్డు ఉండటం తప్పనిసరి. ఇది ఆర్థిక మోసాలను నిరోధించడంలో ప్రభుత్వానికి సహాయపడుతుంది. ప్రజలు తమ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయాలని ఆదాయపు పన్ను శాఖ చెబుతోంది.
ప్రస్తుతం పాన్ కార్డు ప్రతి ఒక్కరి జీవితంలో ఆధార్‌లాగా ముఖ్యమైన భాగమైపోయింది. బ్యాంకు ఖాతా నుంచి వివిధ లావాదేవీలను నిర్వహించాలంటే.. ఇది తప్పనిసరి. ఇంకా పన్ను చెల్లింపుదారులకూ పాన్‌కార్డు ఉండటం తప్పనిసరి. ఇది ఆర్థిక మోసాలను నిరోధించడంలో ప్రభుత్వానికి సహాయపడుతుంది. ప్రజలు తమ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయాలని ఆదాయపు పన్ను శాఖ చెబుతోంది. కాగా, ఈ ఆధార్ లింక్‌కు గడువు ఈ ఏడాది డిసెంబర్ 31తో ముగుస్తుంది. ఈ క్రమంలో వినియోగదారులను మరోసారి అలర్ట్ చేసింది. మీరు ఇంతకు ముందు మీ పాన్‌ను ఆధార్ కార్డ్‌తో లింక్ చేయకుంటే మీ పాన్ కార్డ్ డీ-యాక్టివేట్ అవుతుంది. ఇది లావాదేవీకి సంబంధించిన ఇతర సమస్యలను కూడా కలిగిస్తుంది. ప్రస్తుతం టెక్నాలజీ యుగంలో ఆర్థిక మోసాల కేసులు కూడా గణనీయంగా పెరిగాయి. అనేక ఫిన్‌టెక్ కంపెనీలు కస్టమర్ ప్రొఫైల్స్‌ను రూపొందించడానికి అనధికారిక పద్ధతిలో పాన్ వివరాలను ఉపయోగిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. అందుకే వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కాకుండా నిరోధించేందుకు పాన్ ద్వారా వ్యక్తిగత వివరాల యాక్సెస్ ను పరిమితం చేయాలని ప్రభుత్వం భావించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆలయాల చుట్టూ అఘోరీ మాత ప్రదక్షిణల వెనుక పరమార్థం ఏమిటి ??
చాలా ఏళ్లకు కనిపించి.. సడ్‌సర్‌ప్రైజ్ చేసిన తమ్ముడు హీరోయిన్