రైల్వే ప్రయాణికులకు అలర్ట్ !! టికెట్ క్యాన్సిలేషన్‌కు కొత్త రూల్స్
భారతీయ రైల్వే ప్రయాణికులకు కీలక అప్‌డేట్ ఇచ్చింది. టికెట్ రద్దు, రీఫండ్, బోర్డింగ్ స్టేషన్ మార్పుల నిబంధనలను సవరించింది. ఏప్రిల్ 1 నుండి అమలయ్యే ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం, రీఫండ్ గడువు, బోర్డింగ్ స్టేషన్ మార్పు, కౌంటర్ టికెట్ల రద్దు, ఈ-టికెట్ రీఫండ్ ప్రక్రియ సులభతరం అయ్యాయి. దళారుల దందాకు అడ్డుకట్ట వేసి, పారదర్శకత పెంచడమే లక్ష్యం.
భారతీయ రైల్వే శాఖ ప్రయాణికులకు కీలక అప్‌డేట్ ఇచ్చింది. టికెట్ల రద్దు, బోర్డింగ్ స్టేషన్ మార్పునకు సంబంధించి నిబంధనలను సవరించింది. టికెట్ల బ్లాక్ మార్కెటింగ్‌లో దళారుల దందాకు అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రయాణికులకు మరింత సౌలభ్యం కల్పించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్టు రైల్వే శాఖ వెల్లడించింది. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి 15 మధ్య దశలవారీగా అమల్లోకి రానున్నాయి. ప్రయాణీకులు తమ టికెట్ రద్దు చేసుకునే సమయాన్ని బట్టి రిఫండ్ మొత్తాన్ని మూడు విభాగాలుగా విభజించారు. రైలు బయలుదేరడానికి 72 గంటల ముందే టికెట్ రద్దు చేసుకుంటే, కేవలం కనీస క్యాన్సిలేషన్ ఛార్జీలు మినహాయించి పూర్తి మొత్తాన్ని రిఫండ్ చేస్తారు. 72 నుండి 24 గంటల మధ్య ఈ సమయంలో రద్దు చేస్తే టికెట్ ధరలో 25 శాతం మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని తిరిగి ఇస్తారు. ప్రయాణానికి ఒక రోజు ముందు నుండి 8 గంటల లోపు రద్దు చేసుకుంటే 50 శాతం నిధులు మాత్రమే వాపస్ వస్తాయి. రైలు బయలుదేరడానికి 8 గంటల కంటే తక్కువ సమయం ఉన్నప్పుడు టికెట్ రద్దు చేస్తే ఎలాంటి రిఫండ్ లభించదు. కేవలం రిఫండ్ మాత్రమే కాకుండా ప్రయాణికులకు మరికొన్ని వెసులుబాట్లు కల్పించారు. రైలు బయలుదేరడానికి 30 నిమిషాల ముందు వరకు కూడా ప్రయాణికులు తమ బోర్డింగ్ స్టేషన్‌ను మార్చుకోవచ్చు. నగరాల్లో ఎక్కువ స్టేషన్లు ఉన్నప్పుడు ఇది ఎంతో ఉపయోగకరం. గతంలో కౌంటర్ టికెట్ రద్దు చేయాలంటే రైలు ప్రారంభమయ్యే స్టేషన్‌లోనే వీలుండేది. ఇకపై దేశంలోని ఏ రైల్వే స్టేషన్‌లోనైనా కౌంటర్ టికెట్‌ను రద్దు చేసుకోవచ్చు. ఇ-టికెట్ కలిగిన వారు గతంలో మాన్యువల్‌గా టీడీఆర్ ఫైల్ చేయాల్సి వచ్చేది. ఇకపై ప్రయాణికుడి ప్రమేయం లేకుండానే నిబంధనల ప్రకారం ఆటోమేటిక్‌గా రిఫండ్ ప్రక్రియ జరుగుతుంది. అలాగే, ప్రయాణానికి 30 నిమిషాల ముందు వరకు కౌంటర్ టికెట్‌పై ప్రయాణ తరగతిని అప్‌గ్రేడ్ చేసుకునే సదుపాయం కల్పించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం.. 48 గంటల ముందు రద్దు చేస్తే ఏసీ ఫస్ట్ క్లాస్‌కు రూ.240, స్లీపర్‌కు రూ.120 చొప్పున ఛార్జీలు ఉన్నాయి. ప్రయాణానికి 4 గంటల ముందే రిఫండ్ ప్రక్రియ ఆగిపోయేది. కానీ కొత్త నిబంధనల ప్రకారం 8 గంటల ముందే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రైల్వే వ్యవస్థలో పారదర్శకత పెంచడానికి, ప్రయాణికులపై ఆర్థిక భారం తగ్గించడానికి ఈ సంస్కరణలు ఎంతగానో దోహదపడతాయని రైల్వే శాఖ భావిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ట్రాఫిక్ చలాన్లు ఎగ్గొడుతున్నారా.. మీకో షాకింగ్ న్యూస్ !!
సార్.. నేను బతికే ఉన్నా.. న్యాయం చేయండి !!
పాఠశాల వంటగదిలో వింత శబ్ధాలు.. అక్కడ సీన్ చూసి అంతా..