భారీగా పెరిగిన బంగారం ధర.. తులం ఎంతంటే..?

Updated on: Sep 10, 2025 | 5:41 PM

బంగారం ధర ఆల్‌టైమ్ గరిష్టానికి చేరింది. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి క్షీణిస్తుండడం కూడా బంగారం పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. బంగారం పది గ్రాముల ధర రూ.లక్షా పదివేల మార్క్ దాటి పరుగులు పెడుతుండగా.. వెండి కిలో ధర రూ.లక్షా 40వేల మార్క్ కు చేరుకుంది.

సెప్టెంబర్ 10, బుధవారం నాటి ధరలు పరిశీలిస్తే.. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 24 కేరట్ల బంగారం ధర తులం రూ.1,12,800 రూపాయిలు ఉండగా, 22 కేరట్ల గోల్డ్ ధర రూ. 1,04,450 రూపాయిలుగా ఉంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.1,27,700 రూపాయలుగా ఉంది. ఢిల్లీలో 24 కేరట్ల బంగార ధర 1,10,450, 22 కేరట్ల ధర రూ.1,01,260 లుగా ఉంది. వెండి కిలో ధర రూ.1,30,100లుగా ఉంది. ముంబైలో 24 కేరట్ల బంగార ధర 1,10,300, 22 కేరట్ల ధర రూ.1,01,110 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,30,100లుగా ఉంది. చెన్నైలో 24 కేరట్ల బంగారం ధర రూ.1,10,740 ఉండగా.. 22 కేరట్ల ధర రూ.1,01,510 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,39,900 గా ఉంది. కోల్‌కతాలోలో 24 కేరట్ల బంగారం ధర రూ.1,10,300 ఉండగా.. 22 కేరట్ల ధర రూ.1,01,100 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,39,900 గా ఉంది. రెండునెలల్లో పసిడి స్పీడుకు పగ్గాలు పడటం లేదు. రోజురోజుకీ ధర పెరుగుతుందేగానీ, డౌన్‌ట్రెండ్‌ మాత్రం కనిపించడం లేదని మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎయిర్‌పోర్ట్‌ అధికారుల చేతివాటం బ్యాటరీలు, నూనె దొంగిలించి..

ఆ బాలుడిని చూసి ఆగిపోయిన భారీ వరద

అయ్యో.. మంటల్లో కాలిపోతూ స్కూటీపై ఆసుపత్రికి వెళ్లిన మహిళ

Bigg Boss Telugu 9: మొదలైన ఫస్ట్ వీక్ నామినేషన్స్.. పిచ్చి పిచ్చిగా లొల్లి పెట్టుకున్న బ్యూటీలు

డాక్యుమెంటరీగా.. ప్రొద్దుటూరు దసరా సంబరం