Gold Price: పసిడి ప్రియలకు ఊరట.. తులం ఎంతంటే
గత కొన్ని రోజుల నుంచి వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఈ రోజు స్వల్పంగా తగ్గాయి. దేశీయ మార్కెట్లో బంగారం ధరల పరుగులు బ్రేకు పడింది. వరుసగా పెరుగుతూ ఆల్ టైం హై స్థాయిలోకి వెళ్లి స్థిరపడ్డాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్లో ధరలు కాస్త దిగిరావడం ఊరట కల్పించే విషయం అని చెప్పవచ్చు.
సెప్టెంబర్ 13, శనివారం నాటి ధరలు పరిశీలిస్తే.. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 24 కేరట్ల బంగారం ధర తులం రూ.1,13,220 రూపాయిలు ఉండగా, 22 కేరట్ల గోల్డ్ ధర రూ. 1,04,840 రూపాయిలుగా ఉంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.1,32,900 రూపాయలుగా ఉంది. ఢిల్లీలో 24 కేరట్ల బంగార ధర 1,11,440, 22 కేరట్ల ధర రూ.1,02,160 రూపాయిలుగా ఉంది. ముంబైలో 24 కేరట్ల బంగార ధర 1,11,290, 22 కేరట్ల ధర రూ.1,02,160 గా ఉంది. చెన్నైలో 24 కేరట్ల బంగారం ధర రూ.1,11,290 ఉండగా.. 22 కేరట్ల ధర రూ.1,02,010 గా ఉంది. బెంగుళూరులో 24 కేరట్ల బంగారం ధర రూ.1,11,290 ఉండగా.. 22 కేరట్ల ధర రూ.1,02,010 గా ఉంది. కోల్‌కతాలో 24 కేరట్ల బంగారం ధర రూ.1,11,820 ఉండగా.. 22 కేరట్ల ధర రూ.1,02,310 గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ మార్పులు, రూపాయి విలువ, క్రూడ్ ఆయిల్ ధరలు, మరియు ప్రపంచ ఆర్థిక పరిస్థితులు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని గుర్తుంచుకోవాలి. ధరలు తగ్గడంతో బంగారం కొనుగోలుకు ఉత్తమ సమయం. పండుగ సీజన్‌లో డిమాండ్ పెరగడం వల్ల ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉంటుందని… కాబట్టి దసరా, దీపావళి కోసం బంగారం కొనుగోలు చేయాలనుకునే ఈ సమయంలోనే కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు అంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. దంచికొట్టనున్న వర్షాలు
అల్లు అర్జున్ నా డ్రీమ్ హీరో అమ్మో..రితికాది పెద్ద ప్లానింగే
Disha Patani: దిశా ఇంటిపై కాల్పులు జస్ట్ ట్రైలరే అంటున్న గోల్డీ బ్రార్
ఈ రక్త పరీక్షతో.. 10 సం.ల ముందే బయటపడే క్యాన్సర్
Palm Jaggery: తాటి బెల్లం ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు వదలరు!