Gold Price Today: అయ్యో.. పసిడి మళ్లీ పరుగులు పెడుతోంది.. ఇవాళ తులం ఎంతంటే

Updated on: Dec 10, 2025 | 3:56 PM

బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. డిసెంబర్ నెల ప్రారంభం నుంచే ఈ పెరుగుదల కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులే దీనికి ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.870, వెండిపై కిలోకు రూ.9000 పెరిగింది. హైదరాబాద్, ఢిల్లీ వంటి నగరాల్లో తాజా ధరలు ఇక్కడ చూడండి. కొనుగోలు చేసే ముందు ధరలను పరిశీలించడం మంచిది.

బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి . గత కొన్ని నెలల క్రితం బంగారం ధరలు సామాన్యులను బెంబేలెత్తించగా.. ఇటీవల కాస్త తగ్గుతూ వచ్చాయి. ధర తగ్గుతుంది కదా ఎంతో కొంత బంగారం కొందామనుకునేలోపు మళ్లీ పసిడి ధర అమాంతం పెరిగిపోతూ సామాన్యులకు అందకుండా పోతోంది. డిసెంబర్ నెల మొదటి రోజు నుంచే బంగారం ధరలు భారీగా పెరుగుతూ వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులే బంగారం ధరలు అమాంతం పెరిగేందుకు కారణంగా చెబుతున్నారు నిపుణులు. తాజాగా డిసెంబరు 10 బుధవారం బంగారం ధర మళ్లీ పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.870 పెరిగి, రూ.1,30,310 కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.800 పెరిగి రూ.1,19,450 పలుకుతోంది. కిలో వెండిపై రూ.9000 పెరిగి కేజీ వెండి రూ.1,99,000 పలుకుతోంది. దేశంలోని వివిధ నగరాల్లో మంగళవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,30,460 , పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,19,600 పలుకుతోంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,30,310 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,19,450 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,240, ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,20,300 గా ఉంది. కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,310లు, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,19,450 లు పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,30,310 ఉంటే.. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,19,450 పలుకుతోంది. కిలో వెండి ధర రూ.1,99,000 గా కొనసాగుతోంది. ఈ ధరలు ఉదయం 11 గంటలకు నమోదైనవి. ఇవి సాయంత్రానికి పెరగవచ్చు, తగ్గవచ్చు. బంగారం కొనడానికి వెళ్లేముందు మరోసారి ధరలు చెక్‌చేసుకుంటే మంచిది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

స్క్రిప్ట్‌తో రండి, సినిమా పూర్తి చేసుకెళ్లండి.. సినిమావారికి CM ఆఫర్

అఖండ-2 రిలీజ్‌ ఎఫెక్ట్‌.. బాధలోకి మోగ్లీ డైరెక్టర్

8 ఏళ్ల తరువాత హీరోయిన్‌పై లైంగిక ఆరోపణల కేసు నుంచి హీరోకు విముక్తి

మనసుల్ని గెలిచిన ఇండిగో పైలట్‌.. ఒక్క మాటతో

ఇదే బాగుంది గురూ.. అద్దెకు బంగారం.. లక్షలు సంపాదించండి