Gold & Silver Price Today: భారీగా పెరిగిన బంగారం ధర.. ఎంత పెరిగిందంటే

Updated on: Feb 28, 2026 | 9:02 PM

అంతర్జాతీయ పరిస్థితులు, బలహీనపడిన డాలర్ కారణంగా భారత్‌లో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. ఫిబ్రవరి 28న 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.3,160 పెరిగి రూ.1,64,730కి, వెండి కేజీకి రూ.5,000 పెరిగి రూ.3,00,000కి చేరింది. దేశంలోని వివిధ నగరాల్లో పసిడి, వెండి రేట్లలో స్వల్ప మార్పులున్నాయి. కొనుగోలు చేసే ముందు ధరలు తనిఖీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. గత కొంత కాలం నుంచి గోల్డ్ రేటు పసిడి ప్రియులకు షాక్ ఇస్తోంది. తగ్గినట్లే తగ్గి మళ్లీ అమాంతం ఎగబాకుతున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు పసిడి ధరల మార్పునకు కారణం అవుతున్నాయి. అమెరికాలో ఈ మధ్య జరిగిన పరిణామాలతో కూడా పెట్టుబడిదారులు అప్రమత్తమయ్యారు. డాలర్ బలహీనపడటంతో పెట్టుబడులను బంగారం వైపు మళ్లించారు. దీంతో బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఫిబ్రవరి 28 శనివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ.3,160 లు పెరిగి రూ.1,64,730 లకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 2,900 పెరిగి రూ.1,51,000లు పలుకుతోంది. ఇక వెండి ధర కూడా కేజీపై రూ.5,000లు పెరిగి రూ.3,00,000లకు చేరింది. ఫిబ్రవరి 28, శనివారం దేశంలోని వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలను పరిశీలిస్తే.. దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,64,880 వద్ద ట్రేడవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర రూ.1,51,150 పలుకుతోంది. ముంబై, కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం రూ.1,64,730 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,51,000 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,65,820 ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ.1,52,000 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,64,730 ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,64,730 లు పలుకుతోంది. వెండి ధర కేజీ రూ.3,00,000 గా కొనసాగుతోంది. మార్కెట్ కు అనుగుణంగా ఈ ధరలు పెరగవచ్చు, తగ్గవచ్చు.. బంగారం కొనడానికి వెళ్లేముందు ధరలు మరోసారి చెక్‌ చేసుకోవాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

18 లక్షల సార్లు స్కిప్పింగ్‌ చేస్తాడా ?? నెట్టింట జోరుగా చర్చ

పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు

ఫ్రెంచ్‌ అబ్బాయి..యానాం అమ్మాయి పెళ్లి.. గుర్రపు బండిపై ఊరేగుతూ..

మహేష్‌ పై.. టీమ్ ఇండియా క్రికెటర్ కామెంట్స్

తెలుగులో OTTలోకి వచ్చిన.. మలయాళ సైకలాజికల్ థిల్లర్!

Loading...
Unable to load recommendations.
Follow Us