Gold Price Down: గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం ధర.. ఎంతో తెలుసా.?

|

Nov 08, 2024 | 5:41 PM

పండగలు, వివాహాది శుభకార్యాల నేపథ్యంలో ఇటీవల వరుసగా దూసుకెళ్లిన బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. మంగళవారం దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.1300 మేర తగ్గి రూ.81,100కు చేరినట్లు ఆలిండియా సరాఫా అసోసియేషన్‌ తెలిపింది. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పసిడి ధర గురువారం గరిష్ఠంగా రూ.82,400 మేర పలికిన సంగతి తెలిసిందే.

ఇటీవల కాలం లక్ష రూపాయల మార్కు దాటిన కిలో వెండి ధర సైతం దిగొచ్చింది. గురువారం రూ.99,500 పలకగా.. ఢిల్లీలో సోమవారం దీని ధర రూ.4600 తగ్గి రూ.94,900కు చేరింది. బంగారం వర్తకులు, రిటైలర్ల నుంచి ఆశించిన మేర డిమాండ్‌ లేకపోవడంతో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టడానికి కారణమని అనలిస్టులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా బంగారం ఔన్సు 2740 డాలర్ల వద్ద కొసాగుతుండగా.. వెండి ఔన్సు 32.80 డాలర్లుగా ఉంది.

నవంబర్‌ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు, 7న ఫెడరల్‌ రిజర్వ్‌ 7న వడ్డీ రేట్ల ప్రకటన వంటి ప్రధాన ఈవెంట్లు ఈ వారంలో ఉన్నాయి. జరుగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు, 7న ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్ల ప్రకటన, చైనా ఈ వారంలో ప్రకటించే ఉద్దీపన ప్యాకేజీ తదితర అంశాలు కూడా అంతర్జాతీయంగా బంగరం ధరలను ప్రభావితం చేయవచ్చని భావిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.