Gold Price Today: ఊహించని రీతిలో పెరిగిన బంగారం, వెండి ధరలు ??
బంగారం, వెండి ధరలు దేశీయ మార్కెట్‌లో భారీగా పెరిగాయి, కొనుగోలుదారులకు షాక్ ఇస్తూ. డిసెంబర్ 17 నాటి తాజా మార్కెట్ వివరాల ప్రకారం, తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల బంగారం తులం ధర రూ. 1,34,500, 22 క్యారెట్ల బంగారం రూ. 1,23,300కి చేరుకుంది. కిలో వెండి ధర రూ. 2,22,000కి పెరిగింది. ఈ ఆకస్మిక పెరుగుదల పెట్టుబడిదారులకు ఆందోళన కలిగిస్తోంది.
దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి షాకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. బంగారం, వెండి ధరలు ఒకేసారి భారీగా పెరిగాయి. మంగళవారం కాస్త తగ్గి ఊరటనిచ్చిన గోల్డ్ రేట్లు.. బుధవారం నాటికి ఊహించని రీతిలో పెరిగాయి. బంగారం ఎప్పుడు తగ్గుతుందో.. ఎప్పుడు పెరుగుతుందో అర్ధం కావడం లేదు. ఈ ఊహించని మార్పులతో బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు షాక్ అవుతున్నారు. డిసెంబర్ 17, బుధవారం నాటి ధరలు పరిశీలిస్తే.. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో 24 కేరట్ల బంగారం ధర తులం రూ.1,34,500 రూపాయలుగా ఉంది. 22 కేరట్ల బంగారం ధర తులం రూ.1,23,300 రూపాయలుగా ఉంది.హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2,22,000 రూపాయలుగా ఉంది. ఢిల్లీలో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,660 ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.1,23,450 ఉంది. ముంబైలో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,510 ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.1,23,300 ఉంది. చెన్నైలో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,280 ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.1,24,000 ఉంది. బెంగళూరులో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,500 ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.1,23,300 వద్ద కొనసాగుతోంది. కోల్ కతా లో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,510 ఉండగా, 22 కేరట్ల10 గ్రాముల ధర రూ.1,23,300 వద్ద కొనసాగుతోంది. ఇక వెండిపై కూడా భారీగానే పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో వెండి ధరలు భారీగా పెరిగాయి. తాజా మార్కెట్ సమాచారం ప్రకారం మూడు నగరాల్లో కిలో వెండి ధర రూ.11,000 పెరిగి రూ.2,22,000గా ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 2026 రైల్వే జాబ్ క్యాలెండర్ రెడీ
BSNL బ్రాడ్‌బాండ్ ఫ్లాష్ సేల్.. బెనిఫిట్స్ ఇవే
ఇప్పుడే కొనేయండి.. కొత్త సంవత్సరంలో వాయింపే
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా? సొమ్ము చేసుకున్న విదేశీ బ్రాండ్
