Gold Price Today: ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు.. శనివారం తులం ఎంతంటే..

Updated on: Dec 27, 2025 | 9:18 PM

బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గత ఐదు రోజులుగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి, డిసెంబర్ 27 శనివారం నాడు ఆల్-టైమ్ హైకి చేరాయి. అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన డిమాండ్ కారణంగా ధరలు పుంజుకున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇది కొనుగోలుదారులకు బ్యాడ్‌ న్యూస్‌ కాగా, పెట్టుబడిదారులకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో తాజా ధరలు ఇక్కడ చూడండి.

బంగారం ప్రియులకు బ్యాడ్‌ న్యూస్‌ అని చెప్పాలి. బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గత ఐదు రోజులుగా దేశంలో బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కొందరు విశ్లేషకులు చెబుతున్నట్టుగానే గోల్డ్‌ రేట్స్‌ ఆల్‌టైం హైకి చేరుకున్నాయి. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారంపై పెట్టుబడి పెడుతున్న వారికి ఇది మంచి లాభాలా పంటగా మారింది. డిమాండ్‌ నెలకొనడంతో ధరలు భారీగా పుంజుకుంటున్నాయని నిపుణులు అంటున్నారు. డిసెంబర్ 27, శనివారం నాటి ధరలు పరిశీలిస్తే.. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో 24 కేరట్ల బంగారం ధర తులం రూ.1,41,220 రూపాయలుగా ఉంది. 22 కేరట్ల బంగారం ధర తులం రూ.1,29,450 రూపాయలుగా ఉంది.హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2,74,000 రూపాయలుగా ఉంది. ఢిల్లీలో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,370 ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.1,29,600 ఉంది. ముంబైలో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,220 ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.1,29,450 ఉంది. చెన్నైలో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,820 ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.1,30,000 ఉంది. బెంగళూరులో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,220 ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.1,29,450 వద్ద కొనసాగుతోంది. కోల్ కతా లో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,250 ఉండగా, 22 కేరట్ల10 గ్రాముల ధర రూ.1,29,450 వద్ద కొనసాగుతోంది. ఇక వెండిపై కూడా భారీగానే పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో వెండి ధరలు భారీగా పెరిగాయి. తాజా మార్కెట్ సమాచారం ప్రకారం మూడు నగరాల్లో కిలో వెండి ధర రూ.2,74,000 రూపాయిలుగా ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ… కడలిలో కలిసిన 10 వేల అభాగ్యులు

నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే

వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట

ఈఏడు కలెక్షన్స్‌లో టాలీవుడ్‌ డల్‌.. బాలీవుడ్ ఫుల్

2025లో వారసులను ఆహ్వానించిన టాప్ హీరోలు వీరే