మీరు కొన్న బంగారం ఒరిజనలేనా ?? గుంటూరులో నకిలీ హాల్ మార్క్ దందా

Updated on: Nov 11, 2025 | 4:41 PM

నగల షాపుల్లో నకిలీ హాల్‌మార్క్‌ల కలకలం కొనసాగుతోంది. గుంటూరులో బయటపడిన ఈ మోసాలు బంగారం స్వచ్ఛతపై అనుమానాలు రేపుతున్నాయి. పుత్తడి ధరలు పెరుగుతున్న తరుణంలో, కొందరు కేటుగాళ్లు హాల్‌మార్క్‌ను దుర్వినియోగం చేస్తూ ఇత్తడిని అంటగడుతున్నారు. బీఐఎస్ చర్యలు తీసుకుంటున్నా, వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలి. నిజమైన హాల్‌మార్క్‌ను గుర్తించి, స్వచ్ఛతను తనిఖీ చేసుకోవడం తప్పనిసరి.

నగల షాపుల్లో నకిలీ హాల్‌మార్క్‌ కలకలం రేపుతోంది. తులం బంగారం లక్ష రూపాయలు దాటిన తరుణంలో మనం కొంటున్న బంగారం అసలుదా? నకిలీదా అనే అనుమానం కలుగుతోంది. వాస్తవానికి హాల్‌మార్క్‌ ఉంటే కళ్లుమూసుకుని కొనేయొచ్చనుకుంటాం. కానీ ఆ హాల్‌మార్క్‌ని కూడా హైజాక్‌ చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. గుంటూరు జిల్లాలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అధికారుల సోదాల్లో ఈ గుట్టు బయటపడింది. మార్కెట్‌లో పుత్తడి పేరుతో కొందరు ఇత్తడిని అంటగడుతుండటంతో అలాంటి మోసాలకు చెక్‌ పెట్టేందుకు, మరింత పారదర్శకతకోసం కేంద్రం హాల్‌మార్క్‌ని తీసుకొచ్చింది. బంగారు ఆభరణాలకు ఈ మార్క్‌ని తప్పనిసరి చేసింది. దేశంలో సుమారు 2 లక్షలమంది హాల్‌మార్క్‌ రిజిస్టర్డ్‌ జ్యువెలరీ వ్యాపారులున్నారు.అయితే.. హాల్‌మార్క్‌ విషయంలో ప్రభుత్వం గట్టి చర్యలే తీసుకుంటున్నా.. ఇంకా కొన్ని మోసాలు జరుగుతూనే ఉన్నాయి. గుంటూరు తనిఖీల్లో దొరికిన హాల్‌మార్క్‌ లేజర్‌ మిషినే ఓ ఎగ్జాంపుల్‌. ఈ హాల్‌మార్క్‌ గుర్తును కేటాయించేది బీఐఎస్. అంటే బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌. ఒక్కో ఆర్నమెంట్‌ ఒక్కో ప్లేస్‌లో ఉంటుందీ హాల్‌మార్క్‌. ఉంగరం, బ్యాంగిల్స్‌కి లోపలి భాగంలో.. నెక్లెస్‌కి లాకెట్‌ వెనుక భాగంలో ఇలా ఆ ఆర్నమెంట్‌ స్వరూపాన్ని బట్టి ఈ మార్క్‌ ఉంటుంది. హాల్‌మార్కింగ్ సెంటర్ మార్క్, క్యారెట్ బీఐఎస్ స్టాంప్, జ్యువెలరీ ఐడింటిఫికేషన్ మార్క్, ఇయర్ ఆఫ్ హాల్ మార్కింగ్, ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ వంటి వివరాలు కనిపిస్తాయి. కాకపోతే అవి కంటితో చూడలేనంత సూక్ష్మంగా ఉంటాయి కాబట్టి ఏ భూతద్దంలోనో చూడాల్సిందే. ఇక.. ఇప్పటిదాకా హాల్‌మార్క్‌ అంటూ నగలు కొంటున్న వారికి గుంటూరు సోదాలు షాకిచ్చాయి. గుంటూరులో కొందరు వ్యాపారులు.. తమ ఆభరణాలకు సెల్ఫ్‌ సర్టిఫికెట్‌ ఇస్తున్న విషయం బయటపడటంతో…ఒక్క గుంటూరేనా మరికొన్ని చోట్ల కూడా ఇదే దందా నడుస్తోందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఇంతకీ మనం కొంటోంది మేలిమి బంగారమేనా? ఆ ఆర్నమెంట్స్‌మీద ఉంది ఒరిజనల్‌ హాల్‌మార్కేనా? ఇన్ని డౌట్లెందుకనుకుంటే BIS వెబ్‌సైట్‌లో చెక్‌చేసుకోండి. ఇంకా అనుమానాలుంటే వెంటనే కంప్లయింట్‌ చేయండి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పేకాట రాయుళ్లకు కోర్టు.. శ్రీకాకుళం కోర్ట్ వినూత్న శిక్ష

ప్రేమించలేదని పగబట్టి.. జైలు పాలైన లేడీ కిలాడీ

Elon Musk: చరిత్ర సృష్టించబోతున్న ఎలన్‌ మస్క్‌

Vizag: వెబ్‌సైట్లు,యూట్యూబ్‌లో సెర్చ్ చేసి అత్తను హత్య చేసిన కోడలు

చిరంజీవి రికార్డును బీట్ చేసిన చరణ్.. మొత్తానికి ఊపుమీదున్న తండ్రీకొడుకులు