Gold Price Today: యుద్ధం ఎఫెక్ట్.. బంగారం,వెండి ధరలకు రెక్కలు
పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధమేఘాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, స్టాక్ మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. దీంతో బులియన్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. పెట్టుబడిదారులు నష్టాలను పూడ్చుకునేందుకు బంగారాన్ని అమ్ముకున్నప్పటికీ, యుద్ధ భయాలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. మార్చి 25న ఒకే రోజు బంగారం ధర రూ.3,760, వెండి రూ.10,000 పెరగడం పెట్టుబడిదారులకు ఆందోళన కలిగిస్తోంది.
పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధమేఘాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థని అతలాకుతలం చేస్తున్నాయి. స్టాక్ మార్కెట్లు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఇక బులియన్ మార్కెట్ అయితే తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. పెట్టుబడిదారులు లబోదిబోమంటున్నారు. స్టాక్ మార్కెట్ నష్టాలను పూడ్చుకోవడానికి బంగారాన్ని అమ్ముకుంటున్నారు. బంగారం ధరలు కూడా తీవ్ర మార్పులకు లోనవుతున్నాయి. ఇప్పటికే భారీగా పెరిగి న బంగారం ధరలు మరింత దూసుకెళ్తున్నాయి. గత రెండు రోజులుగా కుప్పకూలిన బంగారం ధరలు మార్చి 25 బుధవారం మళ్లీ పైకి ఎగబాకాయి. ఈరోజు 24 క్యారెట్ల పది గ్రాముల బంగారంపై రూ.3,760లు పెరిగి రూ. 1,46,670లకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.3,450లు పెరిగి, రూ.1,34,450లు పలుకుతోంది. కిలో వెండిపై రూ.10,000లు పెరిగి రూ.2,60,000 పలుకుతోంది. దేశంలోని వివిధ నగరాల్లో బుధవారం బంగారం, వెండిధరలను పరిశీలిస్తే.. దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,820 వద్ద ట్రేడవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర రూ.1,34,600 పలుకుతోంది. ముంబై, కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం రూ.1,46,670 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,34,450 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,48,370 ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ.1,36,000 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,670 ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,34,450 లు పలుకుతోంది. వెండి ధర కిలోకి రూ.2,60,000 గా కొనసాగుతోంది. ఈ ధరలు పెరగవచ్చు, తగ్గవచ్చు.. బంగారం కొనడానికి వెళ్లేముందు ధరలు మరోసారి చెక్‌చేసుకొని వెళ్తే మంచిది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏప్రిల్ 1 నుంచి ‘కొత్త ఐటీ చట్టం-2025’.. కీలక మార్పులివే
ఈపీఎఫ్ఓ సంచలన నిర్ణయం.. క్లెయిమ్ చేయని డబ్బులు నేరుగా ఖాతాల్లోకి
గ్యాస్ బండ చోరీకి ప్లాన్.. కానీ అడ్డంగా బుక్కయ్యాడు
మానవత్వం మరిచిన సంస్థకు.. రూ.210 కోట్ల ఫైన్ వేసిన కోర్టు
రైలులో చిన్నారికి అస్వస్థత.. మునగ సూప్ తాగించడంతో వాంతులు.. అప్పుడే ఓ అద్భుతం