BSNL లో మరో అదిరిపోయే ప్లాన్‌.. రూ. 201కే 90 రోజుల వ్యాలిడిటీ.. ఇంకా

|

Dec 03, 2024 | 6:49 PM

భారతీయ టెలికాం రంగంలో ప్రధాన పోటీదారులుగా జియో, ఎయిర్‌టెల్, వీఐలకు ధీటుగా దూసుకొస్తోంది ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌. ప్రైవేటు టెలికం కంపెనీలకు పోటీగా బీఎస్‌ఎన్‌ఎల్ అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్ల ధరలను ప్రకటిస్తోంది. దీంతో అనేక మంది యూజర్లు ఈ సంస్థ వైపు మొగ్గుచూపుతున్నారు.

ఇదే సమయంలో ప్రైవేట్ కంపెనీల కస్టమర్ల సంఖ్య తగ్గిపోతుంటే, బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల సంఖ్య లక్షల్లో పెరుగుతోంది. దీంతో BSNL చౌక రీఛార్జ్ ప్లాన్‌లతో Jio, Airtel, Vi సంస్థలకు టెన్షన్‌ పెరుగుతోంది. తాజాగా మరో అదిరిపోయే ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది బీఎస్‌ఎన్‌ఎల్‌. BSNL తాజాగా 90 రోజుల వాలిడిటీ ప్లాన్‌ను ప్రకటించింది. దీనిలో మీరు కేవలం 201 రూపాయలకే దాదాపు మూడు నెలల వాలిడిటీని పొందుతారు. మీరు ఎక్కువగా ఇంటర్నెట్‌ని ఉపయోగించకపోతే, ఇది మీకు ఉత్తమమైన ప్లాన్ అవుతుందని చెప్పవచ్చు. మీరు ఏ నెట్‌వర్క్‌కైనా 300 నిమిషాల వరకు ఉచిత కాలింగ్ ఉపయోగించుకోవచ్చు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జీతం పెంచని యజమాని.. ఉద్యోగి చేసిన పనికి అంతా షాక్