జీతమంతా ఈఎంఐలకే పోతోందా? మీ పరిస్థితీ ఇదేనా?

Updated on: Jul 25, 2025 | 12:40 PM

నగరాల్లోని ఉద్యోగులు సంతోషంగా ఉన్నారా? వారి జీతంతో మంచి జీవితాన్ని వారు అనుభవిస్తున్నారా? అంటే లేదనే చెబుతున్నారు ఆర్థిక నిపుణులు. నగరాల్లో ఉంటున్న వారి ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్నాయని, పొదుపు తగ్గుతోందని నిపుణులు అంటున్నారు. నగరవాసులు అప్పుల ఊబిలో ఇరుక్కుపోతున్నారని, నెలవారీ ఈఎంఐలు కట్టే సరికే వారి జీతం హరించుకుపోతోందని వారు వివరిస్తున్నారు.

బ్యాంకు ఖాతాలో అలా జీతం పడగానే.. ఇంటి రెంటు, ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్ బిల్లులు… ఇలా ఒక్కొక్కటిగా అన్నింటికి చెల్లింపులు చేయాల్సి వస్తోంది. వాటన్నింటినీ కట్టాక చేతిలో ఎంత మిగులుతోంది అంటే ఏమీ లేదనే సమాధానం వస్తోంది. ఆర్బీఐ గణాంకాల ప్రకారం గత మూడు సంవత్సరాల్లో వ్యక్తిగత రుణాలు 75% పెరిగాయి. మూడవ వంతు మంది ఉద్యోగులు ఆదాయంలో 33% కంటే అధిక మొత్తాన్ని ఈఎంఐలకే ఖర్చు చేస్తున్నారు. కొందరి విషయంలో ఈ మొత్తం 45% దాటుతోంది. నిపుణుల చెబుతున్న వివరాల ప్రకారం.. ఇప్పటికే 5 నుంచి 10% మధ్య తరగతి కుటుంబాలు పూర్తిగా అప్పుల ఊబిలో చిక్కుకున్నాయి. ‘ఈ అప్పును పెట్టుబడుల కోసం తీసుకోవడం లేదు. కేవలం బతకడానికి తీసుకుంటున్నారు’ అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈఎంఐ చెల్లింపులు తగ్గించుకుని.. ప్రతి నెలా కనీసం 500 రూపాయలతో సిస్టమాటిక్ ఇన్‌వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ సిప్‌లో ఆదా చేయాలని సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నిద్ర లేవగానే ఇలా చేస్తే.. మీ జీవితం అల్లకల్లోలమే

ఇంటి కప్పులో శబ్దాలు.. ఏంటని చూసిన ఓనర్ షాక్‌

బ్రేక్‌ఫాస్ట్‌ స్కిప్‌ చేస్తున్నారా.? అయితే.. రిస్కే

తన స్టైల్లో వీరమల్లు సినిమాకు రివ్యూ ఇచ్చిన హైపర్ ఆది

‘సూపర్ హిట్‌’ డిప్యూటీ సీఎం సినిమాపై.. సీఎం సాబ్‌ వైరల్ ట్వీట్‌!