18 బ్యాంకుల నుంచి రూ.5,572 కోట్లు తీసుకున్న అన్మోల్ అంబానీ

Updated on: Dec 10, 2025 | 5:36 PM

అనిల్ అంబానీ కుమారుడు అన్మోల్ అంబానీపై సీబీఐ కేసు నమోదు చేసింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ కంపెనీ 18 బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.5,572 కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నారు. యూనియన్ బ్యాంక్‌కు రూ.228 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఆరోపణలున్నాయి. నిధుల మళ్లింపుపై ఫోరెన్సిక్ పరిశీలనలో తేలడంతో సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.

అనిల్ అంబానీ కుమారుడు అన్మోల్ అంబానీకి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) షాక్ ఇచ్చింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ కంపెనీ తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమవడంతో అన్మోల్ అంబానీపై సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. యూనియన్ బ్యాంక్‌కు రూ.228 కోట్ల మేర నష్టం వాటిల్లిన వ్యవహారంలో ఈ కేసు నమోదైంది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ సంస్థ యూనియన్ బ్యాంక్ సహా మొత్తం 18 బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రూ.5,572 కోట్లకు పైగా రుణాలు తీసుకుంది. అయితే, రుణం తిరిగి చెల్లించకపోవడంతో పలు సంస్థలు ఫిర్యాదు చేశాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భారత్ లో విదేశీ కంపెనీల పెట్టుబడుల జాతర

CM Revanth Reddy: కులం అనే అడ్డుగోడలను తొలగించేందుకే యంగ్ ఇండియా స్కూల్స్

తెలంగాణ ప్రజలకు అలర్ట్‌.. వచ్చే మూడు రోజులు..

కాసులు కురిపిస్తున్న హారర్ సినిమాలు..

మల్టీప్లెక్స్ బిజినెస్.. మూడు పువ్వులు ఆరు కాయలు