గుడ్‌న్యూస్‌.. విమాన టికెట్ల ధరలు తగ్గాయోచ్‌!

Updated on: Jul 05, 2026 | 8:16 PM

అంతర్జాతీయ ప్రయాణికులకు ఎయిరిండియా శుభవార్త చెప్పింది. ముడిచమురు ధరలు సాధారణ స్థాయికి చేరడంతో విదేశీ విమాన టికెట్లపై విధించే ఇంధన సర్‌ఛార్జీని తగ్గించింది. అమెరికా, ఐరోపా, యూకే, ఆస్ట్రేలియా మార్గాల్లో టికెట్ ధరలు తగ్గనున్నాయి. జులై 1 నుంచే ఈ నిర్ణయం అమల్లోకి రాగా, విద్యార్థులు, పర్యాటకులు, ఇతర ప్రయాణికులకు ఇది ఆర్థికంగా ఊరటనివ్వనుంది.

అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా తీపికబురు అందించింది. విమాన ఇంధనం ధరలు గతంలో భారీగా పెరగడంతో విదేశీ విమాన టికెట్లపై విధించిన ఇంధన సర్‌ఛార్జీని టాటా గ్రూప్‌కు చెందిన ఎయిరిండియా తాజాగా తగ్గించింది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు కాస్త సద్దుమణగడంతో, ముడిచమురు ధరలు మళ్లీ పూర్వపు సాధారణ స్థాయికి చేరుకోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ సర్‌ఛార్జ్ తగ్గింపు ఫలితంగా అమెరికా, ఐరోపా , ఆస్ట్రేలియా, యునైటెడ్‌ కింగ్‌డమ్‌ వంటి దేశాలకు వెళ్లి, వచ్చే అంతర్జాతీయ విమాన టికెట్ల ధరలు భారత్‌లో కొంతమేర తగ్గనున్నాయి. సవరించిన ధరల ప్రకారం.. అమెరికా – ఆస్ట్రేలియా మార్గాల్లో విమాన టికెట్‌పై సర్‌ఛార్జీని గతంలో ఉన్న 280 డాలర్ల నుంచి 200 డాలర్లకు తగ్గించారు. అలాగే ఐరోపా – యూకే మార్గాల్లో టికెట్‌పై విధించే సర్‌ఛార్జీని 205 డాలర్ల నుంచి 125 డాలర్లకు ఎయిరిండియా తగ్గించింది. ఈ విమాన టికెట్ల ధరల తగ్గింపు జులై 1 నుంచే అమల్లోకి వచ్చినట్లు సంబంధిత అధికారిక వర్గాలు వెల్లడించాయి. సుదూర ప్రాంతాలకు ప్రయాణించే అంతర్జాతీయ ప్రయాణికులకు, ముఖ్యంగా పర్యాటకులు మరియు విద్యార్థులకు ఎయిరిండియా తీసుకున్న ఈ నిర్ణయం పెద్ద ఉపశమనం కలిగించనుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

డబ్బుసంచితో బైక్‌పై వెళ్తున్న రైతు.. ఇంటికి వెళ్లి చూడగా గుండె గుభేల్‌

జ్వరంతో బాధపడుతున్న జగన్నాథుడు..15 రోజులు ఐసోలేషన్‌లోనే

గుడిలో హుండీలనే కాదు.. వీటిని కూడా కొట్టేస్తున్నారు..

రుషికొండ భవనాలు ఏం చేయబోతున్నారో తెలుసా?

బిర్యానీ ఫ్రీ అన్నారు.. తీరా అక్కడికి వెళ్లాక..

Follow Us