రూ. 15 వేల లోపు స్మార్ట్‌ఫోన్లు ఫీచర్లు మాములుగా లేవు

Updated on: Jan 01, 2026 | 4:53 PM

కొత్త సంవత్సరం 2026లో ₹15,000 లోపు ఉత్తమ బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్‌ల కోసం వెతుకుతున్నారా? ఈ కథనం మీకు సరైన ఎంపికలను అందిస్తుంది. రెడ్ మీ, వివో, ఒప్పో, శాంసంగ్‌ వంటి ప్రముఖ బ్రాండ్‌ల నుండి తాజా మోడళ్లను, వాటి కీలక ఫీచర్లు, కెమెరా నాణ్యత, బ్యాటరీ, పనితీరును పరిశీలించి, మీ అవసరాలకు తగిన ఫోన్‌ను ఎంచుకోవడానికి సహాయపడుతుంది.

కొత్త సంవత్సరం 2026లో యూజర్లు ఎప్పటికప్పుడు మార్చే డివైజ్‌ ఏదైనా ఉందంటే అది స్మార్ట్‌ ఫోన్‌. శాంసంగ్‌ నుంచి పోకో వరకు కొత్త మోడల్‌ ఫోన్‌లు మార్కెట్‌లో విడుదలవుతున్నాయి. ఎక్కువ మంది కొనేవి బడ్జెట్‌ ఫోన్లే కాబట్టి రూ. 15 వేల ధర లోపు ఫోన్లు చూద్దాం. రెడ్ మీ 15సీ 5జీ స్మార్ట్‌ఫోన్‌ మూడు ర్యామ్ స్టోరేజ్‌లలో అందుబాటులో ఉంది. MediaTek చిప్‌, HD+ రిజల్యూషన్, 6.9-అంగుళాల స్క్రీన్‌తో వస్తోంది. 8-మెగాపిక్సెల్ సెల్పీ కెమెరా, వెనక వైపు 50-మెగాపిక్సెల్ కెమెరా తో వప్తోంది. 4GB RAM + 128GB స్టోరేజ్ ఫోన్‌ ధర రూ. 12,499గా ఉంది. మంచి పనితీరు కనబరిచే మరో ఫోన్‌ వివో T4x 5G . గేమింగ్ కోసం రోజువారీ వినియోగం కోసం శక్తివంతమైన MediaTek ప్రాసెసర్, మంచి 50MP AI కెమెరా, 6.72-inches డిస్‌ప్లే 44Watt ఫ్లాష్ ఛార్జింగ్‌తో వస్తుంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ ప్రింట్ సెన్సర్, IP64 రేటింగ్‌ ఇందులో మనం చూడొచ్చు. OPPO K13x 5G ధర Rs 12,499 మాత్రమే. అద్భుత డిజైన్ మంచి పని తీరున్న ఫోన్లలో మంచి ఎంపిక శాంసంగ్ గెలాక్సీ ఎం సిరీస్‌లో కొత్త మోడల్‌ ఎం17 5జీ మంచి ఫీచర్లున్న ఫోన్‌. M16 5G కంటే ఇందులో fast ప్రాసెసర్, పెద్ద బ్యాటరీ ఉండటం చూస్తాం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Best FD Interest Rates: ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తున్నారా? ఏ బ్యాంక్‌లో ఎంత వడ్డీ రేటు

గుండెను కాపాడే ఈ సూపర్ ఫుడ్ గురించి తెలుసా

కొండలా ఉన్న పొట్ట సులువుగా కరిగిపోవాలంటే..

పాకిస్థాన్‌లో సూపర్‌ రిచ్ ఈ హిందూ మహిళ

ఛీ.. ఎంతకు తెగిస్తున్నార్రా.. అప్పన్న ప్రసాదంలో నత్త అంటూ ఫేక్ వీడియో