Budget 2024 LIVE: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్ ప్రసంగం.. లైవ్ వీక్షించండి

|

Jul 23, 2024 | 11:14 AM

వరుసగా ఏడోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌. ఏటా బడ్జెట్‌ రోజున ధరించే చీరల విషయంలో ఏదో ఒక ప్రత్యేకత కనబరిచే ఆమె.. ఈసారి తెలుపు, మెజెంటా రంగు చీరలో మెరిశారు. నిర్మలా సీతారామన్‌ బడ్జెట్ ప్రసంగాన్ని లైవ్ వీక్షించండి...

ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన కేంద్రం.. మిగిలిన 8 నెలల కాలానికి వార్షిక బడ్జెట్‌ ఇవాళ సభ ముందు ఉంచింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఈసారి బడ్జెట్‌లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూనే కొన్ని సెక్టార్‌లకు భారీ కేటాయింపులు చేశారు. అన్నదాతల కోసం ఇటీవల పంటల కనీస మద్దతు పెంచామని..  మరో ఐదేళ్ల పాటు 80 కోట్ల మందికి ఉచిత రేషన్‌ ఇవ్వనున్నట్లు ప్రసంగంలో నిర్మలా వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

 

 

Published on: Jul 23, 2024 11:11 AM