Nainika Anasuru: ‘ఇండస్ట్రీ వల్గర్‌గా తయారైంది.. ఓపెన్‌గా అడిగేస్తున్నారు..!’
నైనిక... బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ద్వారా పాపులర్ అయిన డ్యాన్సర్ తాజా ఇంటర్వ్యూలో తెలుగు సినీ పరిశ్రమలోని కాస్టింగ్ కౌచ్‌పై తన అనుభవాలను పంచుకుంది. పరిశ్రమ వల్గర్‌గా మారిందని, కొందరు ఓపెన్‌గా కమిట్‌మెంట్‌ను డిమాండ్ చేస్తున్నారని ఆమె ఆరోపించింది. ఈ విషయంపై తాను ఎదుర్కొన్న ఒక ఘటనను కూడా వివరించింది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో కనిపించి పాపులర్ అయిన నటి నైనిక, తాజా ఇంటర్వ్యూలో తెలుగు సినీ పరిశ్రమలోని కాస్టింగ్ కౌచ్ సమస్యపై సంచలన వ్యాఖ్యలు చేసింది. సినిమా ఇండస్ట్రీ వల్గర్‌గా మారిందని, కొంతమంది ఓపెన్‌గా కమిట్‌మెంట్ అడుగుతున్నారని ఆమె పేర్కొంది. తాజాగా తనకు వచ్చిన ఒక ఫోన్ కాల్‌ను ఉదాహరణగా చూపిస్తూ, బ్రాండ్ ప్రమోషన్స్ పేరుతో వ్యక్తిగత అవసరాలను అడిగినట్లు తెలిపింది. “పర్సనల్ రిక్వైర్మెంట్” అనే పదం పదేపదే ఉపయోగించడంతో తనకు అర్థమైందని, ఆ వ్యక్తి తనకు పరిచయం ఉన్న వ్యక్తి అని కూడా చెప్పింది. కొంతమంది అమ్మాయిల వల్లే ఈ పరిస్థితి క్రియేట్ అవుతుందని, కమిట్‌మెంట్ ఇస్తేనే ఆఫర్స్ వస్తాయనే భావనను కొందరు వ్యాప్తి చేస్తున్నారని నైనిక అభిప్రాయపడింది.
