AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhagyashri Borse: తొలి బ్లాక్‌బస్టర్‌తో భాగ్యశ్రీ బోర్సే దశ తిరిగింది.. బిగ్‌ ఛాన్స్‌ కొట్టిన ముద్దుగుమ్మ

Bhagyashri Borse: తొలి బ్లాక్‌బస్టర్‌తో భాగ్యశ్రీ బోర్సే దశ తిరిగింది.. బిగ్‌ ఛాన్స్‌ కొట్టిన ముద్దుగుమ్మ

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Oct 07, 2026 | 10:19 PM

Share

‘మిస్టర్‌ బచ్చన్‌’తో టాలీవుడ్‌కు పరిచయమైన భాగ్యశ్రీ బోర్సే.. ‘లెనిన్‌’తో కెరీర్‌లో తొలి బ్లాక్‌బస్టర్‌ అందుకున్నారు. ఈ సక్సెస్‌తో ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. తెలుగులో యంగ్‌ హీరోలతో సినిమాలు చేస్తూనే, మోహన్‌లాల్‌ సరసన ‘ఆపరేషన్‌ గంగ’తో మలయాళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ మూవీ అప్‌డేట్స్‌, వెకేషన్‌ ఫొటోలతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నారు.

రీసెంట్‌గా కెరీర్‌లో తొలి బ్లాక్ బస్టర్ అందుకున్న భాగ్యశ్రీ బోర్సే, బిగ్ స్క్రీన్స్‌తో పాటు స్మార్ట్ స్క్రీన్స్ మీద కూడా జోరు చూపిస్తున్నారు. ఓ వైపు వరుస సినిమాలు చేస్తూనే మరో వైపు ఆన్‌లైన్‌ అప్‌డేట్స్‌తోనూ రచ్చ చేస్తున్నారు. రీసెంట్‌ టైమ్స్‌లో ఈ బ్యూటీ సోషల్ మీడియా యాక్టివిటీ కూడా టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘మిస్టర్ బచ్చన్’తో సిల్వర్ స్క్రీన్‌కు పరిచయమయ్యారు భాగ్యశ్రీ బోర్సే. తన గ్లామర్‌ గ్రేస్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ బ్యూటీ కెరీర్‌ స్టార్టింగ్‌లో సక్సెస్‌ విషయంలో తడబడ్డారు. రీసెంట్‌గా లెనిన్ సినిమాతో కెరీర్‌లో తొలి బ్లాక్ బస్టర్‌ అందుకున్న ఈ భామ ఆ సినిమాలో తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో టాలీవుడ్‌ను ఫిదా చేసింది. ఆ సక్సెస్‌ తరువాత ఈ బ్యూటీకి ఆఫర్లు క్యూ కట్టాయి. ఇప్పటికే తెలుగులో యంగ్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటున్న ఈ భామ.. మలయాళ ఇండస్ట్రీలోకి ఓ క్రేజీ ప్రాజెక్ట్‌తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిపోయారు. మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్‌లాల్ సరసన హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసి లక్కీ గర్ల్ అనిపించుకుంటున్నారు భాగ్యశ్రీ. ఆపరేషన్‌ గంగ మూవీతో మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెడుతున్న ఈ భామ అక్కడ తొలి సినిమానే మోహన్‌ లాల్ టాప్ హీరోతో నటించే ఛాన్స్ రావటంతో సూపర్ ఎగ్జైటెడ్‌గా ఉన్నారు. బిగ్‌ స్క్రీన్ మీద ఇంత బిజీగా ఉన్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ తగ్గేదే లే అంటున్నారు. మూవీ విశేషాలతో పాటు వెకేషన్ అప్‌డేట్స్‌తోనూ ఫ్యాన్స్‌ను ఎంగేజ్‌ చేస్తున్నారు ఈ బ్యూటీ… దీంతో ఆన్‌లైన్‌లో కూడా భాగ్యశ్రీ క్రేజ్‌ నెక్ట్స్ లెవల్‌లో కనిపిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చివరి కోరిక తీరకుండానే కన్నుమూసిన సింగీతం

గాల్లో 28 వేల అడుగులకు పడిపోయిన విమానం.. బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌లో ఎమర్జెన్సీ

భూమి పై భారీ ఉల్కాపాతం..! ఆ జీవరాశుల అంతానికి, దీనికి సంబంధమేంటి?

దృశ్యం సినిమా తరహాలో తండ్రిని చంపేసాడు.. చివరికి

శివాలయంలో అద్భుత దృశ్యం..శివలింగం చుట్టూ నాగుపాముల ప్రదక్షిణలు

Follow Us