AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srikanth Odela: సుకుమార్ ఇంటి చుట్టూ మూడేళ్లు పిచ్చోడిలా తిరిగా..

Srikanth Odela: సుకుమార్ ఇంటి చుట్టూ మూడేళ్లు పిచ్చోడిలా తిరిగా..

Phani CH
|

Updated on: Oct 07, 2026 | 10:00 PM

Share

‘దసరా’, ‘ది ప్యారడైజ్‌’ సినిమాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్‌ ఓదెల తన ఇండస్ట్రీ ప్రయాణంలోని కష్టాలను గుర్తుచేసుకున్నారు. తనకు ఎంతో ఇష్టమైన దర్శకుడు సుకుమార్‌ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేయడానికి ఏకంగా మూడేళ్లు ఆయన ఇంటి చుట్టూ తిరిగినట్లు చెప్పారు. చివరకు సుకుమార్‌ సూచనతో షార్ట్‌ ఫిల్మ్‌ తీసుకెళ్లి, ఎన్నో ప్రయత్నాల తర్వాత ‘నాన్నకు ప్రేమతో’, ‘రంగస్థలం’ సినిమాలకు ఆయన టీమ్‌లో పనిచేసే అవకాశం దక్కించుకున్నట్లు వెల్లడించారు.

సినిమా రంగంలో సక్సెస్ సాధించిన ప్రతి దర్శకుడి వెనుకా ఒక ఆసక్తికరమైన ప్రయాణం ఉంటుంది. తెరపై కనిపించే పేరు, క్రేజ్ రావడానికి ముందు ఎన్నో అవమానాలు, ఎదురుచూపులు, రిజెక్షన్స్ ఎదుర్కొన్నవాళ్లు చాలామందే ఉన్నారు. అలాంటి కష్టాల నుంచి దర్శకుడిగా ఎదిగిన వారిలో శ్రీకాంత్ ఓదెల ఒకరు. దసరా, ది ప్యారడైజ్ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రోజులను తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. ఈ క్రమంలోనే అసిస్టెండ్ డైరెక్షన్ ఛాన్స్ కోసం.. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఇంటి చుట్టూ మూడేళ్లు పిచ్చోడిలా తిరిగా అంటూ చెప్పుకొచ్చారు. శ్రీకాంత్ ఓదెలకు చిన్నప్పటి నుంచే సినిమా అంటే ఆసక్తి. అయితే దర్శకుడిగా మారాలనే లక్ష్యంతో ఆయన వేసిన తొలి అడుగులు అంత సులభంగా సాగలేదు. ముఖ్యంగా తనకు ఎంతో ఇష్టమైన దర్శకుడు సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయాలనే కోరికను నెరవేర్చుకోవడానికి చాలా కాలం ప్రయత్నించారట. ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో శేషు అనే లెక్చరర్ ద్వారా సుకుమార్‌తో పరిచయం ఏర్పడే అవకాశం లభించిందని శ్రీకాంత్ తెలిపారు. ఆ పరిచయాన్ని ఉపయోగించుకుని సుకుమార్ టీమ్‌లో చేరేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పట్లో అవకాశం దక్కలేదట. ‘ఆర్య 2’ తర్వాత అన్నపూర్ణ స్టూడియోలో సుకుమార్‌ను కలిసినట్లు శ్రీకాంత్ వెల్లడించారు. అప్పటి నుంచి ఆయన దగ్గర పనిచేయాలనే పట్టుదల మరింత పెరిగిందట. అవకాశం కోసం ఏకంగా మూడేళ్ల పాటు సుకుమార్ ఇంటి చుట్టూ తిరిగినట్లు చెప్పారు. రోజూ ఉదయం అపార్ట్‌మెంట్ దగ్గరకు వెళ్లి సుకుమార్‌ను కలిసేందుకు ప్రయత్నించేవాడినని, ఉదయం గుడ్ మార్నింగ్, రాత్రి గుడ్ నైట్ చెప్పడం తన రెగ్యులర్ డ్యూటీ మారిపోయిందని గుర్తుచేసుకున్నారు. ఇలా చాలా కాలం తర్వాత ఒకరోజు సుకుమార్ తనను గమనించి, ఎవరు నువ్వు.? ఏం కావాలి.? అని అడిగారని చెప్పారు. అప్పుడు తనకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయాలనే కోరిక ఉందని శ్రీకాంత్ చెప్పారట. దీంతో ముందుగా ఒక షార్ట్ ఫిల్మ్ తీసుకురావాలని సుకుమార్ సూచించారని తెలిపారు. సుకుమార్ చెప్పినట్టుగానే షార్ట్ ఫిల్మ్ తీసుకుని వెళ్లిన శ్రీకాంత్‌కు ఆ తర్వాత కొన్ని అనుకోని పరిణామాలు ఎదురయ్యాయట. ఎన్నో ఇబ్బందులు దాటుకుని చివరకు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన నాన్నకు ప్రేమతో చిత్రానికి పనిచేసే అవకాశం దక్కిందని ఆయన వెల్లడించారు. ఆ తర్వాత రంగస్థలం సినిమా కోసం షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి విడుదల వరకు సుకుమార్ టీమ్‌లో భాగంగా పనిచేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పవన్‌తో సింగీతం ‘జీసెస్’ సినిమా చేద్దామనుకున్నారట.. ఆ సినిమా ఎందుకు ఆగిపోయిదంటే

Follow Us