భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రేషన్ మాఫియా అక్రమాలపై స్పెషల్ ఫోకస్

Updated on: Dec 31, 2025 | 10:59 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రేషన్ మాఫియా అక్రమాలను విజిలెన్స్ అధికారులు ఛేదించారు. పేదల కోసం ఉద్దేశించిన 300 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని జీపీఎస్ ట్రాకర్‌ను బైక్‌కు అమర్చి దారి మళ్లించారు. ఎంఎల్ఎస్ పాయింట్ సిబ్బంది, పీడీఎస్ డీలర్లతో కుమ్మక్కై జరిగిన ఈ భారీ కుంభకోణంలో 13 మందిని అరెస్టు చేశారు. అధికారుల పర్యవేక్షణ లోపమే అక్రమాలకు కారణమని తేలింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రేషన్ మాఫియా అక్రమాలపై విజిలెన్స్ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. పేదల కోసం ఉద్దేశించిన ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు. సాధారణంగా రేషన్ బియ్యం రవాణా చేసే లారీలకు జీపీఎస్ ట్రాకర్లు అమరుస్తారు. అయితే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్రమార్కులు లారీకి బదులుగా బైక్‌కు జీపీఎస్ అమర్చి అధికారులను ఏమార్చారు. ఈ విధంగా మల్లారం ఏఎంసి గోదాం నుంచి పాల్వంచ ఎంఎల్ఎస్ పాయింట్‌కు తరలించాల్సిన 300 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని దారి మళ్లించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

న్యూ ఇయర్ ట్రిప్‌కి పూజా, మాళవిక, మౌని రాయ్‌

దేశ ప్రజలకు కేంద్రం భారీ శుభవార్త..జనవరి 1 నుంచి

బంగారం కోసం ఇంటి ఓనర్‏ను చంపి గోదావరిలో పడేసిన యువకులు

30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు