Bengaluru: కమలా నగర్‌లో 4అంతస్తుల భవనాన్ని కూల్చేసిన అధికారులు.. వీడియో

|

Oct 17, 2021 | 9:54 AM

కర్ణాటకలోని బెంగుళూరులో శిథిలావస్థలో ఉన్న భవనాలను అధికారులు కూల్చివేస్తున్నారు. తాజాగా మరో భవనాన్ని మంగళవారం సాయంత్రం కూల్చివేశారు.

కర్ణాటకలోని బెంగుళూరులో శిథిలావస్థలో ఉన్న భవనాలను అధికారులు కూల్చివేస్తున్నారు. తాజాగా మరో భవనాన్ని మంగళవారం సాయంత్రం కూల్చివేశారు. పశ్చిమ బెంగళూరు కమలా నగర్‌లోని నాలుగు అంతస్తుల భవనాన్ని పడగొట్టారు. ఎలాంటి ప్రాణ హాని జరగకుండా అగ్నిమాపక, అత్యవసర సేవా అధికారులు, పోలీసులు అక్కడే ఉన్నారు. భవనాన్ని కూల్చే ముందు ఆ భవనంలో నివసించే వారితోపాటు పరిసరాల్లో నివసించే వారందరిని ఇతర ప్రాంతాలకు తరలించారు. వారికి వసతితోపాటు ఆహారం ఏర్పాటు చేసినట్లు బృహత్ బెంగళూరు మహానగర పాలిక ఒక ప్రకటనలో తెలిపింది.భారీ వర్షం కారణంగా ఆ భవనం కాస్త వంపుకు తిరిగింది. ఇలాంటివే నగరంలో ఉండటంతో బెంగుళూరు మున్సిపల్ కార్పొరేషన్ శిథిలావస్థ భవనాల జాబితా తయారు చేసింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Devil Tree: విశాఖలో దెయ్యం చెట్టు.. హడలిపోతున్న జనాలు.. అసలు మ్యాటర్ ఏంటంటే.. వీడియో

Viral Video: వామ్మో.. రణ ధ్వని.. నిమిషం పాటు కూతపెడుతున్న కోడిపుంజు.. వీడియో