బ్రేక్‌ఫాస్ట్‌ స్కిప్‌ చేస్తున్నారా.? అయితే.. రిస్కే

Updated on: Jul 25, 2025 | 12:16 PM

ఉదయం బ్రేక్‌ ఫాస్ట్ చేయడం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆరోగ్యకరమైన జీవనానికి ఉదయాన్నే టిఫిన్‌ చేయడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతుంటారు. అయితే ప్రస్తుతం జీవన విధానం మారింది. గజిబిజీగా మారిన జీవితంలో ఉదయం బ్రేక్‌ఫాస్ట్ స్కిప్‌ చేస్తోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదంటున్నారు.

ఇంతకీ బ్రేక్‌ఫాస్ట్‌ స్కిప్‌ చేయడం వల్ల ఎలాంటి నష్టాలు వస్తాయంటున్నారు నిపుణులు. ఉదయం టిఫిన్‌ స్కిప్‌ చేసే వారిలో మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. టిఫిన్‌ తీసుకోవడం మానేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కళ్లు తిరగడం, బలహీనత వంటి సమస్యలు వస్తాయని అంటున్నారు. ఉదయం అల్పాహారం మానేయడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. అనేక తీవ్రమైన వ్యాధులకు ఇది కారణమవుతుందంటున్నారు. ఎక్కువసేపు ఆహారం తీసుకోకుండా ఉండడం వల్ల కణాలు దెబ్బతింటాయి. ఇది రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. అల్పాహారం తీసుకోని వారు ఎక్కువ మొత్తంలో లంచ్ చేయటం వల్ల బరువు పెరుగుతారని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ఉదయం టిఫిన్‌ తీసుకోవడం మానేస్తే జీవక్రియ మందగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. టిఫిన్ స్కిప్ చేయటం వల్ల జీర్ణ సమస్యలకు దారి తీయటమే గాక.. శరీరంలోని జీవక్రియలు గతితప్పుతాయని అంటున్నారు. మైగ్రేన్‌ వంటి సమస్యలకు కూడా టిఫిన్‌ స్కిప్‌ చేయడం ఒక కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎక్కువసేపు ఆకలితో ఉండడం తీవ్రమైన తలనొప్పి, వికారం, వాంతులు వంటి సమస్యలు వస్తాయని అంటున్నారు. ఇక ఉదయం టిఫిన్‌ మానేసి వారిలో జంక్‌ ఫుడ్ లేదా ఫాస్ట్ ఫుడ్‌ తినాలనే కోరిక పెరుగుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ఇది ఆరోగ్యంపై తీత్ర ప్రభావాన్ని చూపుతుంది. ఇది ఉబకాయం మొదలు.. అల్సర్‌, గ్యాస్‌ సంబంధిత సమస్యలకు దారి తీస్తుందని అంటున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మానేయడం మంచి అలవాటు కాదని అంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తన స్టైల్లో వీరమల్లు సినిమాకు రివ్యూ ఇచ్చిన హైపర్ ఆది

‘సూపర్ హిట్‌’ డిప్యూటీ సీఎం సినిమాపై.. సీఎం సాబ్‌ వైరల్ ట్వీట్‌!

మరీ ఇంత ఏడుపుగొట్టు సినిమానా ఇది! చూసిన వాళ్లందరూ పడీ పడీ ఏడుస్తున్నారుగా

ఆ గ్రామంలో చింత చెట్టే డాక్టర్! చెట్టు కాండం గుండా వెళితే రోగాలు మాయం!