అయోధ్యలో అంతర్జాతీయి విమానాశ్రయం పేరు మార్పు
అయోధ్యలో భవ్య రామమందిరి ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లూ చకచకా జరిగిపోతున్నాయి. అయోధ్య మొత్తం ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఎన్నెన్నోమార్పులు చోటుచేసుకుంటున్నాయి. అయోధ్యలో అడుగుపెట్టగానే శ్రీరామచంద్రుడి దివ్యమంగళ స్వరూపం ప్రతిఒక్కరి మదిలో నిలిచిపోయేలా రైల్వేస్టేషన్ మొదలు ఎయిర్ పోర్ట్ వరకూ కొత్త రూపాలను సంతరించుకుంటున్నాయి. ఇటీవలే అయోధ్యలో రైల్వేస్టేషన్‌ను 50 వేలమందిసామర్ధ్యంతో పునరభివృద్ధి చేసి.. అయోధ్యధామ్‌గా పేరు మార్చారు.
అయోధ్యలో భవ్య రామమందిరి ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లూ చకచకా జరిగిపోతున్నాయి. అయోధ్య మొత్తం ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఎన్నెన్నోమార్పులు చోటుచేసుకుంటున్నాయి. అయోధ్యలో అడుగుపెట్టగానే శ్రీరామచంద్రుడి దివ్యమంగళ స్వరూపం ప్రతిఒక్కరి మదిలో నిలిచిపోయేలా రైల్వేస్టేషన్ మొదలు ఎయిర్ పోర్ట్ వరకూ కొత్త రూపాలను సంతరించుకుంటున్నాయి. ఇటీవలే అయోధ్యలో రైల్వేస్టేషన్‌ను 50 వేలమందిసామర్ధ్యంతో పునరభివృద్ధి చేసి.. అయోధ్యధామ్‌గా పేరు మార్చారు. ఇప్పడు ఎయిర్‌పోర్ట్ పేరును కూడా మార్చారు. అయోధ్యలో కొత్తగా నిర్మించిన విమానాశ్రయానికి రామాయణ ఇతిహాసాన్ని రచించిన కవి, మహర్షి వాల్మీకి పేరు పెట్టారు. గతంలో ఉన్న మర్యాద పురుషోత్తం శ్రీ రామ్ అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయం పేరును మార్పుచేస్తూ.. మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్,అయోధ్య ధామ్ గా నామకరణం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ రేపు శనివారం ఈ ఎయిర్‌పోర్టును ప్రారంభించనున్నారు. జనవరి 22న అయోధ్య రామాలయంలో మహా సంప్రోక్షణ కార్యక్రమానికి ముందే ఈ ఎయిర్‌పోర్టులో సేవలు ప్రారంభం కానున్నాయి. సంబంధిత వివరాలను ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఉత్తరాదిని కమ్మేసిన పొగమంచు.. 50 మీటర్ల దూరంలో కూడా కనిపించని వాహనాలు
25 వేల మంది యాత్రికులకు లాకర్ సౌకర్యం
కిచెన్‌లో గ్యాస్ సిలిండర్ నుంచి వింత శబ్దాలు.. పక్కకు తీసి చూస్తే
నాంపల్లి ఎగ్జిబిషన్‌కు సర్వం సిద్ధం.. కొలువుతీరనున్న వివిధ రాష్ట్రాలకు చెందిన 2,400 స్టాళ్లు