Araku Coffee: ప్రమాదంలో అరకు కాఫీ తోటలు

Updated on: Sep 09, 2025 | 6:31 PM

అరకు కాఫీ తోటలను కాఫీ బెర్రీ బోరర్ అనే ప్రమాదకరమైన తెగులు ముంచుకొస్తోంది. ఇది తొలిసారిగా అరకులో కనిపించిన ఈ తెగులు వల్ల కాఫీ పంటకు తీవ్ర నష్టం జరుగుతోంది. కాఫీ బోర్డు శాస్త్రవేత్తలు నివారణ చర్యలు చేపడుతున్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.అరకు ప్రాంతంలో ప్రఖ్యాతమైన కాఫీ తోటలను కాఫీ బెర్రీ బోరర్ అనే తెగులు తీవ్రంగా దెబ్బతీస్తోంది.

అరకు ప్రాంతంలో ప్రఖ్యాతమైన కాఫీ తోటలను కాఫీ బెర్రీ బోరర్ అనే తెగులు తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అరకు కాఫీ పంటకు ముప్పుగా మారింది. ఈ తెగులు ఆడ కీటకం ద్వారా వ్యాపిస్తుంది. ఒక్కో కీటకం 50 కంటే ఎక్కువ కాఫీ గింజల్లో గుడ్లు పెడుతుంది. 35 రోజుల్లో 30 నుంచి 40 కీటకాలు పుట్టి ఇతర గింజలకు వ్యాపిస్తాయి. కాఫీ బోర్డు, జేఎల్ఓ, సిసిఆర్ఐ, ఆర్వీనగర్ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు సర్వే నిర్వహించి నివారణ చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వం కూడా ఈ సమస్యను తీవ్రంగా పరిగణిస్తూ, తెగులు నివారణకు చర్యలు తీసుకుంటోంది. రైతులు అప్రమత్తంగా ఉండి, తెగులు నివారణకు సహకరించాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హిమాచల్ ప్రదేశ్ లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని ఏరియల్ సర్వే

అవి క్షుద్రపూజలు కాదు.. ఆ ఒక్క తప్పే మేం చేసింది

కులమతాలకు అతీతంగా తురకపాలెంలో పూజలకు నిర్ణయం

Gold Price: ఆకాశమే హద్దుగా.. బంగారం ధర

4 రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం.. దంచికొట్టనున్న వర్షాలు