AP Liquor Scam: ఏపీ కల్తీ లిక్కర్‌ కేసులో కొత్త లింకులు

Updated on: Oct 07, 2025 | 2:17 PM

ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ మద్యం దందా విస్తృతమవుతున్న నేపథ్యంలో ఎక్సైజ్ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ములకలచెరువు నుండి ఇబ్రహీంపట్నం వరకు విస్తరించిన ఈ నెట్‌వర్క్‌లో జనార్ధన్ రావు సోదరుడు జగన్మోహన్ రావు అదుపులో ఉన్నారు. పరారీలో ఉన్న జనార్ధన్ రావు పాస్‌పోర్ట్ వివరాలను సేకరిస్తున్నారు. పెద్ద ఎత్తున పట్టుబడిన మద్యం వెనుక ఉన్న మూలాలను అధికారులు శోధిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ మద్యం కేసు దర్యాప్తును ఎక్సైజ్ అధికారులు ముమ్మరం చేశారు. ములకలచెరువు నుండి ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం వరకు విస్తరించిన ఈ కల్తీ మద్యం నెట్‌వర్క్ మూలాలను వెలికితీయడానికి లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు జనార్ధన్ రావు సోదరుడు జగన్మోహన్ రావును ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు ఆయన్ను కోర్టులో హాజరుపరచనున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Shilpa Shetty: చీటింగ్ కేసులో నటి శిల్పాశెట్టిపై ప్రశ్నల వర్షం

సిరిమాను దర్శనం కోసం తరలివస్తున్న లక్షలాది మంది భక్తులు..