శబరిమల ప్రసాదం ‘అరవణ’లో కల్తీ

|

Oct 08, 2024 | 10:11 AM

తిరుమల లడ్డు తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ వ్యవహారం యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఈ వివాదం ఇంకా ఓ కొలిక్కి రాకముందే.. మరో ప్రముఖ ఆలయం ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ కొత్త పంచాయతీ తాజాగా తెరమీదకు వచ్చింది. తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయం తర్వాత అంతే గుర్తింపు పొందిన శబరిమల ఆలయం ప్రసాదంలో కూడా కల్తీ జరిగినట్టుగా సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.

తిరుమల లడ్డు తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ వ్యవహారం యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఈ వివాదం ఇంకా ఓ కొలిక్కి రాకముందే.. మరో ప్రముఖ ఆలయం ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ కొత్త పంచాయతీ తాజాగా తెరమీదకు వచ్చింది. తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయం తర్వాత అంతే గుర్తింపు పొందిన శబరిమల ఆలయం ప్రసాదంలో కూడా కల్తీ జరిగినట్టుగా సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. శబరిమలలో ప్రసాదంగా ఇస్తున్న అరవణలో మోతాదుకు మించి క్రిమిసంహారకాలు కలిసినట్లు నిర్ధారించడంతో ఈ అరవణను వాడకూడదని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం 6.65 లక్షల కంటైనర్లలో ఉన్న ఈ అరవణ ప్రసాదాన్ని ఎరువుగా మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. దీని విలువ దాదాపు 5 కోట్ల 30 లక్షల రూపాయిలు. శబరిమల అయ్యప్ప దేవాలయంలో గత ఏడాదిగా ఈ ప్రసాదం నిల్వలో ఉంది. ఈ ప్రసాదం తయారీలో ఉపయోగించిన యాలకుల్లో అనుమతించిన మోతాదును మించి క్రిమిసంహారకాలు కలిసినట్లు తేల్చారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కళ్యామ్ రామ్ కొడుకు, కూతురును చూశారా ?? ఎంత పెద్దవాళ్లయ్యారో..

TOP 9 ET News: మనకు చేతకాక రాజమౌళి మీద తోసేశాం అంతే

Follow us on