Guntur: క్షుద్రపూజల అరిష్టం తొలగిపోవాలంటూ శివుడికి అభిషేకాలు

Updated on: Sep 15, 2025 | 10:33 PM

గుంటూరు జిల్లా రెడ్డిపాలెం గ్రామంలో చంద్రగ్రహణం రోజు జరిగిన క్షుద్ర పూజల అనంతరం, గ్రామస్తులు శివుడికి అభిషేకాలు చేసి శాంతి పూజలు నిర్వహించారు. ప్రతి ఇంటి నుంచి నీటి కలశాలను తీసుకువచ్చి శివలింగానికి అభిషేకం చేశారు. వేద పండితుల మార్గదర్శకత్వంలో ఈ శాంతి పూజలు జరిగాయి.

గుంటూరు జిల్లా రెడ్డిపాలెం గ్రామంలో ఇటీవల చంద్రగ్రహణం రోజున కొందరు అఘోర పూజలు నిర్వహించినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటన గ్రామంలో భయాందోళనలకు దారితీసింది. క్షుద్ర పూజల ప్రభావం తొలగిపోవడానికి, గ్రామస్తులు శివుడికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఇంటి నుంచి మహిళలు నీటి కలశాలను తీసుకువచ్చి, వేద పండితుల ఆధ్వర్యంలో శివలింగానికి అభిషేకం చేశారు. సున్నాల పరమాన్ని పారాయణం చేయడం ద్వారా దోషం తొలగిపోతుందని వేద పండితులు తెలిపారు. ఈ శాంతి పూజలతో గ్రామంలో శాంతి నెలకొనాలని గ్రామస్తులు ఆశిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

2047 స్వర్ణాంధ్ర విజన్ లక్ష్యంగా కలెక్టర్లు పనిచేయాలి

వర్షాల ఎఫెక్ట్ మరోసారి నిలిచిపోయిన ముంబై లో మోనోరైలు

ముషీరాబాద్ లో గల్లంతైన యువకుడి కోసం గాలింపు

యూరియూ సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత వాళ్లదే

తెలంగాణ ప్రైవేట్ ఆస్పత్రుల కీలక నిర్ణయం..ఆరోగ్యశ్రీ సేవలు బంద్