SSC Exams 2026: ఏపీలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పబ్లిక్ పరీక్షలు 2026 షెడ్యూల్ విడుదలైంది. మార్చి 16 నుండి ఏప్రిల్ 1 వరకు జరిగే ఈ పరీక్షల పూర్తి టైం టేబుల్ విద్యాశాఖ ప్రకటించింది. ఉదయం 9:30 నుండి 12:45 వరకు పరీక్షలు జరుగుతాయి. సైన్స్ పేపర్లకు మాత్రం ఉదయం 11:30 వరకు సమయం ఉంటుంది. ప్రభుత్వ సెలవులను బట్టి షెడ్యూల్‌లో మార్పులు ఉండవచ్చు.
ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. టైం టేబుల్ ప్రకారం పదో తరగతి పబ్లిక్ పరీక్షలు 2026 మార్చి 16 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 1 వరకు జరగనున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఫిజికల్, బయాలజికల్ సైన్స్ పరీక్షలు మాత్రం 9.30 నుంచి 11.30 వరకు జరుగుతాయి. ప్రభుత్వ సెలవుల ప్రకారం అవసరమైతే టైమ్‌టేబుల్‌లో మార్పులు ఉంటాయని సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు స్పష్టం చేసింది. ప్రశ్నపత్రం తారుమారైతే రాసిన అభ్యర్థుల ఫలితాలు రద్దు చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది. ఏపీ పదవతరగతి పబ్లిక్ పరీక్షల 2026 పూర్తి టైమ్‌టేబుల్ విషయానికి వస్తే.. మార్చి 16న ఫస్ట్ లాంగ్వేజ్, మార్చి 18న సెకండ్ లాంగ్వేజ్, మార్చి 20న ఇంగ్లిష్ పరీక్ష, మార్చి 23న మాథ్స్, మార్చి 25న ఫిజికల్ సైన్స్, మార్చి 28న బయాలజికల్ సైన్స్, మార్చి 30న సోషల్ స్టడీస్ పరీక్షతో ప్రధాన పరీక్షలు ముగుస్తాయి. ప్రధాన పరీక్షల అనంతరం మార్చి 31న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2, ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -1 పరీక్షలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 1న ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -2తో పాటు ఎస్ఎస్సి, ఒకేషనల్ కోర్సుల థియరీ పరీక్షలు జరుగుతాయి. అయితే, సైన్స్ పరీక్షలు మరియు కొన్ని ఒకేషనల్ కోర్సుల పేపర్లకు మాత్రమే పరీక్ష ముగింపు సమయం ఉదయం 11:30 గంటల వరకు ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా
డెలివరీ బాయ్‌గా మారిన ఎమ్మెల్యే.. ‘ఏ పనీ తక్కువ కాదన్న నేత’