Andhra Pradesh: విశాఖ పర్యటనలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు.. డిసెంబర్‌లోగా..

| Edited By: TV9 Telugu

Oct 16, 2023 | 3:05 PM

విశాఖ పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్. డిసెంబర్‌లోగా విశాఖకు షిఫ్ట్‌ అవుతానన్నారు. విశాఖ నుంచే పాలన కొనసాగిస్తామన్నారు. పరిపాలనా విభాగం అంతా ఇక్కడికే మారుతుందన్నారు. ఇప్పటికే విశాఖ ఎడ్యుకేషన్‌ హబ్‌గా మారిందన్న ముఖ్యమంత్రి.. ఐటీ హబ్‌గా కూడా మారబోతుందన్నారు. విశాఖ మధురవాడ ఐటీ హిల్స్‌లో ఇన్ఫోసిస్‌ కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత సీఎం జగన్‌ ఈ కామెంట్స్‌ చేశారు.

విశాఖపట్నం, అక్టోబర్ 16: విశాఖ పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్. డిసెంబర్‌లోగా విశాఖకు షిఫ్ట్‌ అవుతానన్నారు. విశాఖ నుంచే పాలన కొనసాగిస్తామన్నారు. పరిపాలనా విభాగం అంతా ఇక్కడికే మారుతుందన్నారు. ఇప్పటికే విశాఖ ఎడ్యుకేషన్‌ హబ్‌గా మారిందన్న ముఖ్యమంత్రి.. ఐటీ హబ్‌గా కూడా మారబోతుందన్నారు. విశాఖ మధురవాడ ఐటీ హిల్స్‌లో ఇన్ఫోసిస్‌ కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత సీఎం జగన్‌ ఈ కామెంట్స్‌ చేశారు. విశాఖ నుంచి త్వరలోనే పాలన కొనసాగిస్తానని చెప్పిన ఏపీ సీఎం జగన్‌ ఆ దిశగా చర్యలు చేపట్టారు. ఇవాళ విశాఖ, అనకాపల్లిలో జిల్లాలో పర్యటించారు. విశాఖలో ఐటీ సెజ్ హిల్ నెంబర్ 2లోని ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఆ తర్వాత ఫార్మాసిటీలో కొత్తగా నిర్మించిన యూజియా స్టెరిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని, లారస్ ల్యాబ్స్‌లో నిర్మించిన అదనపు భవనాలను, యూనిట్ 2 ఫార్ములేషన్ బ్లాక్, ఎల్ఎస్‌పీఎల్ యూనిట్ 2ను జగన్ ప్రారంభించారు.

Follow us on