ఆగమైన అమృతసర్‌ను ఆదుకున్న వాహనం
ఆగకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పంజాబ్ అతలాకుతలమైంది. ఈ క్రమంలో.. అమృత్‌సర్ నగరం వరద ముంపుకు గురైంది. వరుస వర్షాలతో నగరంలోని పలు కాలనీలు నీటమునిగిపోగా, జనజీవనం స్తంభించిపోయింది. దీంతో ఎన్డీఆర్‌ఎఫ్ , ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలతో పాటు సహాక చర్యల కోసం ఆర్మీ , నేవీ బృందాలను కూడా రంగం లోకి దింపారు అధికారులు.
భారీ వరదల నేపథ్యంలో రంగంలోకి దిగిన భారత సైన్యం అమృత్‌సర్‌లో పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టింది. సహాయక చర్యల కోసం అధునాతన యంత్రాలు, వాహనాలను వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోనే..ATOR N1200 వెహికిల్స్‌ను ఆర్మీ రంగంలోకి దించి.. వాటి సాయంతో వరదల్లో చిక్కుకున్న వారిని ఒడ్డుకు చేర్చుతున్నారు. అమృతసర్ వరద సహాయక చర్యల్లో బాహుబలిగా పేరు తెచ్చుకున్న ఈ వాహనం.. నేల, బురద, నీరులో సునాయాసంగా ప్రయాణిస్తుంది. దీని 4 టైర్లు.. ఎంత బురదలోనైనా కూరుకుపోకుండా.. నేల మీద గ్రిప్ సాధిస్తాయి. 13.2 అడుగుల పొడవు, 4002mm పొడవు, 8.26 అడుగుల వెడల్పు, మరియు 9.3 అడుగుల ఎత్తు ఉండే ఈ వాహనం.. గ్రౌండ్ క్లియరెన్స్ అద్భుతంగా ఉంటుంది. భారత సైన్యం కోసం మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ కింద చండీగఢ్‌లోని ఒక సంస్థ ఈ వాహనాలను తయారుచేసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో, నదులు, కాలువలు దాటాల్సిన సందర్భాల్లో ఆర్మీకి ఈ వాహనం బ్రహ్మాండంగా అక్కరకొస్తోంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వెహికల్ లుక్, వరద నీటిలో చాలా సులువుగా ప్రయణించడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Update Aadhaar: ఆధార్ అప్‌డేట్‌పై యూఐడీఏఐ కీలక సూచనలు
Megastar Chiranjeevi: అభిమానికి మెగాస్టార్ భరోసా!
ఆకట్టుకుంటున్న కదంబ పుష్పాల గణపతి