రైతుల ఇంట సిరులు కురిపిస్తున్న కచిడి చేపలు!
అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేది మత్స్యకారులకు అరుదైన కచిడి చేపలు అదృష్టాన్ని తెచ్చాయి. సుదీర్ఘ విరామం తర్వాత వేటకు వెళ్లిన మత్స్యకారులకు భారీ కచిడి చేపలు చిక్కాయి. ఒక్క చేపకే రూ. 2 లక్షలు, మూడు చేపలకు రూ. 1.5 లక్షలు పలికాయి. వైద్య రంగంలో దీని వాయుసంచికి ఉన్న డిమాండే ఈ ధరలకు కారణం.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సుదీర్ఘ విరామం తర్వాత వేటకు వెళ్లిన మత్స్యకారుల ఇంట కచిడి చేపలు సిరులు కురిపిస్తున్నాయి. సఖినేటిపల్లి మండలం అంతర్వేది సముద్ర తీరంలో మత్స్యకారులకు అదృష్టం వరించింది. మంగళవారం వేటకు వెళ్లిన మత్స్యకారుల వలలో సుమారు 25 కిలోల బరువున్న అరుదైన మగ కచిడి చేప చిక్కింది. ఈ భారీ చేప పడటంతో మత్స్యకారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అంతర్వేది మినీ హార్బర్ కు తీసుకువచ్చిన ఈ చేపను బహిరంగ వేలంలో ఒక స్థానిక వ్యాపారి అక్షరాలా రూ. 2 లక్షల భారీ ధరకు దక్కించుకున్నాడు. ఇది ఒక్కటే కాదు. వేట ప్రారంభించిన తొలి రోజు సోమవారం కూడా మత్స్యకారుల వలకు ఒకేసారి మూడు అరుదైన కచిడి చేపలు చిక్కాయి. అంతర్వేది పల్లిపాలెం మినీ హార్బర్‌కు తీసుకొచ్చిన ఈ చేపలను చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు. హార్బర్ లో నిర్వహించిన బహిరంగ వేలంలో ఈ మూడు చేపలను ఒక స్థానిక వ్యాపారి లక్షన్నర పెట్టి కొనుగోలు చేశాడు. ఈ కచిడి చేపలకు అంతర్జాతీయ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. వీటి పొట్ట భాగంలో ఉండే వాయుసంచిని వైద్య రంగంలో శస్త్రచికిత్సకు ఉపయోగించే దారాలు, ప్రాణరక్షక ఔషధాల తయారీలో ముడిసరుకుగా ఉపయోగిస్తారు.
మరిన్ని వీడియోల కోసం :
డేంజర్ జోన్లో తెలుగు రాష్ట్రాలు..జూన్ 30 వరకు వణికించనున్నవానలు
బైకు కొనివ్వలేదని అమ్మమ్మపై మనవడి ఘాతుకం
రైతుల ఇంట సిరులు కురిపిస్తున్న కచిడి చేపలు!
భద్రాచలంలో దారుణం.. మూఢనమ్మకంతో ఇంటి యజమాని ఏంచేశాడో చూడండి..!
తిరుమలలో ఘరానా మోసం.. సుప్రభాత సేవ, వసతి పేరుతో 60 మందికి టోకరా !
పిట్టగోడపై కూర్చుని ఫోన్ మాట్లాడుతున్న యువతి .. అంతలోనే
శ్రీచరణ్,రాధ బంధంలో ఏంటా ట్రాకర్.. షాకింగ్ నిజాలు

