రామజన్మభూమి ట్రస్ట్‌కు అంబానీ భారీ విరాళం

|

Jan 25, 2024 | 6:45 PM

యోధ్య రామజన్మభూమి ట్రస్ట్‌కు విరాళాల పర్వం కొనసాగుతోంది. సోమవారం బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ కుటుంబం 2.51 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించింది. రామజన్మభూమి ట్రస్ట్‌కు ఈ పెద్ద మొత్తాన్ని ఇస్తున్నట్టు ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖేష్ అంబానీ తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు ఈ విరాళాన్ని అందించారు.

యోధ్య రామజన్మభూమి ట్రస్ట్‌కు విరాళాల పర్వం కొనసాగుతోంది. సోమవారం బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ కుటుంబం 2.51 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించింది. రామజన్మభూమి ట్రస్ట్‌కు ఈ పెద్ద మొత్తాన్ని ఇస్తున్నట్టు ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖేష్ అంబానీ తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు ఈ విరాళాన్ని అందించారు. సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగివున్న అయోధ్య రామ మందిర అభివృద్ధికి పవిత్ర ప్రయత్నం అంటూ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. రాముడు అయోధ్యలో కొలువుదీరడం దేశం యావత్తు ఆనందంలో మునిగితేలుతోందని, ప్రజలందా దీపావళి జరుపుకుంటున్నారని ముఖేశ్ అంబానీ అన్నారు. జనవరి 22న దేశం మొత్తానికి రామ్ దీపావళి అంటూ వ్యాఖ్యానించారు. ఇది చారిత్రాత్మకమైన రోజు అని నీతా అంబానీ ఆనందం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇక్కడ తవ్వే కొద్ది వజ్రాలు !! 65 ఏళ్లల్లో కోటి కేరట్ల వెలికితీత

ఇక్కడ ఎంతటి కోటీశ్వరుడైనా అడుక్కోవాల్సిందే

Hanuman: UP సీఎంను కదిలించిన ‘హనుమాన్’

Follow us on