విజయనగరం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం..ఆయిల్‌ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు..

|

Aug 26, 2024 | 9:09 AM

విజయనగరం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాజాం-చీపురుపల్లి రోడ్డులోని తిమ్మయ్యపేట సమీపంలో సీతారామ ఆయిల్‌ కర్మాగారంలో ఆదివారం రాత్రి తొమ్మిది గంటల సమీపంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తవుడు నుంచి ఆయిల్‌ను తీయగా మిగిలిన ముడిసరుకు అగ్నికి ఆహుతైంది.

విజయనగరం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాజాం-చీపురుపల్లి రోడ్డులోని తిమ్మయ్యపేట సమీపంలో సీతారామ ఆయిల్‌ కర్మాగారంలో ఆదివారం రాత్రి తొమ్మిది గంటల సమీపంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తవుడు నుంచి ఆయిల్‌ను తీయగా మిగిలిన ముడిసరుకు అగ్నికి ఆహుతైంది. జరిగిన ప్రమాదంలో రూ.50లక్షలకు పైగా విలువ చేసే పశువుల దాణా అగ్నికి ఆహుతైనట్టుగా చెప్పారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే రాజాం అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనాస్థలానికి చేరకుని మంటలను అదుపుచేసే ప్రయత్నాలు చేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published on: Aug 26, 2024 08:46 AM