ఆకలేస్తుందని చల్లబజ్జీలు తిన్నారు.. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే 50 మంది..
కాకినాడ జిల్లా దుగ్గుదుర్రు గ్రామంలో రోడ్‌సైడ్ కాకా హోటల్‌లో చల్ల బజ్జీలు తిన్న సుమారు 50 మంది ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు గురయ్యారు. బాధితులకు కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు రావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఘటన అనంతరం హోటల్ యజమాని పరారయ్యాడు. నాసిరకం పిండి లేదా నూనె కారణమై ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
కాకినాడ జిల్లా కాజులూరు మండలం దుగ్గుదుర్రు గ్రామంలో ఫుడ్ పాయిజన్ కారణంగా 50 మంది ఆస్పత్రి పాలయ్యారు. స్థానిక రోడ్‌సైడ్ కాకా హోటల్‌లో చల్ల బజ్జీలు తిన్న గ్రామస్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. దుగ్గుదుర్రు సెంటర్‌లో ఉన్న సదరు కాకా హోటల్‌లో రాత్రి సమయంలో చాలా మంది చల్ల బజ్జీలు తిన్నారు. ఆ తర్వాత కొన్ని గంటలకే తిన్న వారందరికీ ఒకరి తర్వాత ఒకరికి కడుపు నొప్పి, విరేచనాలు, వాంతులు మొదలయ్యాయి. బాధితుల సంఖ్య క్రమంగా పెరిగి 50 కి చేరడంతో వారందరినీ వెంటనే గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ వైద్యాధికారిణి డాక్టర్ సుప్రియ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది బాధితులకు తక్షణ అత్యవసర వైద్య సేవలు అందించడంతో అందరూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. విషయం తెలుసుకున్న కాకినాడ డీఎంహెచ్‌ఓ డాక్టర్ నాయక్ తక్షణమే దుగ్గుదుర్రు గ్రామానికి చేరుకుని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అక్కడి సిబ్బందిని ఆదేశించారు. కాగా, ఈ ఘటన తర్వాత సదరు కాకా హోటల్ యజమాని దుకాణాన్ని మూసివేసి పరారయ్యాడు. హోటల్‌లో ఉపయోగించిన నాణ్యత లేని పిండి లేదా నూనె వల్లే ఈ ఫుడ్ పాయిజన్ జరిగి ఉండవచ్చని వైద్యాధికారులు భావిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హోంమంత్రి అనిత మంచి మనసు.. మహిళా ఎస్సైకి ఘనంగా సీమంతం
పడిపోతున్న పసిడి ధరలు.. భయంతో జనం ఏం చేస్తున్నారో చూడండి!
తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్! మరో 2 రోజులు దంచికొట్టనున్న వానలు!
గోల్డ్ మార్కెట్ కొలాప్స్.! ఆకాశం నుండి పాతాళానికి..రేపటి రేట్లు వింటే మైండ్ బ్లాక్!
కోటీశ్వరుడిని పెళ్లి చేసుకోవాలనుకున్నా.. కానీ నేనే ధనవంతురాలిని అయ్యా.. న్యూట్రిషనిస్ట్ కథ వైరల్