Lunar Eclipse 2026: మార్చి 3న తొలి చంద్రగ్రహణం

Updated on: Jan 02, 2026 | 4:55 PM

కొత్త ఏడాది 2026లో మొదటి చంద్రగ్రహణం మార్చి 3న రానుంది. ఈ అద్భుత ఖగోళ ఘటనను 'వోల్ఫ్ సూపర్‌మూన్' అని పిలుస్తారు. ఈ గ్రహణంలో చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు. ఈశాన్య భారత రాష్ట్రాలతో పాటు పలు దేశాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. మార్చి 3 సాయంత్రం 6:22 గంటలకు ప్రారంభమై సుమారు 1.5 గంటలు ఉంటుంది.

కొత్త ఏడాది 2026లో మొదటి చంద్రగ్రహణం మార్చి 3న వస్తోంది. ఈ చంద్ర గ్రహణం ఉదయించే చంద్రునిగా కనిపించనుంది. తూర్పు భారతదేశంలో గ్రహణం ముగింపు ఉంటుందని అంచనా. అలాగే 2026 రెండు చంద్రగ్రహణాలు ఉండబోతున్నాయట. మార్చి 3వ తేదీ పౌర్ణమి రోజున చంద్రగ్రహణం సంభవించనుంది. ఇది ఒక అద్భుత ఖగోళ ఘటన కానుంది. ఆ రోజున చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు. గ్రహణం మార్చి 3వ తేదీ సాయంత్రం 6:22 గంటలకు ప్రారంభమవుతుందట. సుమారు ఒక గంట 31 నిమిషాల పాటు ఉండనుంది. ఈశాన్య భారత రాష్ట్రాలు అంటే బెంగాల్, నాగాలాండ్, మిజోరం, అస్సాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ లో చంద్రగ్రహణం బాగా కనిపిస్తుందట. మిగిలిన ప్రాంతాల్లో చంద్రగ్రహణం ముగింపు మాత్రమే కనిపిస్తుందని చెబుతున్నారు. మన దేశంతో పాటు ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్ లో ఈ చంద్రగ్రహణం కనిపిస్తుందని సమాచారం. దీనిని ఖగోళ శాస్త్రవేత్తలు wolfsupermoon అని అంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్

క్రిస్మస్ సెలవులకి బ్యాంక్‌లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

వాహనాదారులకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి టోల్‌ ఫ్రీ

నో వెయిటింగ్‌.. నో పుషింగ్‌.. శ్రీవారి సన్నిధిలో కొత్త టెక్నాలజీ సూపర్‌ సక్సెస్‌

ఓరి మీ ఏషాలో.. న్యూ ఇయర్‌ వేళ మందుబాబుల హంగామా