Andhra: సరదాగా బయటకు వెళ్లి ఇంటికి తిరిగొచ్చారు.. ఎదురుగా కనిపించిన సీన్ చూసేసరికి

Updated on: Sep 10, 2025 | 5:37 PM

అలా బయటకు వెళ్లి.. ఇంటికి వచ్చేలోపు జరగాల్సింది జరిగిపోయింది. ఇంటి తాళం తీసి ఉంది. లోపలికి వెళ్లి చూడగా.. దెబ్బకు షాక్ అయ్యారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే.? ఆ ఘటన ఏంటి.? ఈ స్టోరీలో చూసేద్దాం మరి.. ఓ సారి లుక్కేయండి.

కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ వెంకటయ్య నగర్‌లో పట్టపగలే చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేనిది గమనించి తాళం పగలగొట్టి బంగారు ఆభరణాలు దొంగలించారు దుండగులు. సుమారు 12 తులాల బంగారం ఆభరణాలు చోరీకి గురైనట్లు తెలిపారు బాధితులు. కాగా, సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అటు కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం వగరూరులోనూ దోపిడీ దొంగలు హల్‌చల్ చేశారు. వరుసగా రెండు దేవాలయాల్లో చోరీకి పాల్పడ్డారు. హుండీలను పగలుగొట్టి రూ. 35 వేల నగదును ఎత్తుకెళ్లారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఈ పని చేసింది ఊరు దొంగలా, బయట దొంగలా అనే కోణంలో విచారణ చేపట్టారు.