పలాస రైల్వేస్టేషన్ వద్ద ఇద్దరు వ్యక్తుల బిత్తరచూపులు.. చేతిలో పెద్ద బ్యాగులు.. ఆపి చెక్ చేయగా
పలాస రైల్వే స్టేషన్ పరిసరాల్లో పోలీసులు నిఘా పెట్టారు. అందరిని క్షుణ్ణంగా చెకింగ్ చేస్తున్నారు. ఈలోగా వాళ్ళకు ఓ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారి చేతిలో రెండు పెద్ద బ్యాగులు ఉన్నాయ్. పట్టుకుని చెక్ చేయగా.. దెబ్బకు షాక్ అయ్యారు. ఆ వివరాలు..
శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. స్థానిక సాయిబాబ గుడిలైన్‌లో ఉత్తరప్రదేశ్‌కి చెందిన రోహిత్, అనురుద్దీన్‌లు గుట్టుగా గంజాయి అమ్మకాలు చేపట్టారు. పక్కా సమాచారంతో వారిని రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకుని.. వారి నుంచి 10.631 కేజీల గంజాయి, రూ.1940 నగదు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సాలోని పర్లాకిమిడికి చెందిన సుమన్ మాలిక్ నుంచి గoజాయి తీసుకొని విశాఖలో ఉన్న కేరళకు చెందిన ఆస్కార్‌కి అందజేసేందుకు వెళ్తుండగా.. పోలీసులకు చిక్కారు ఈ నిందితులు. ఉపాధి కల్పించాలని ఉత్తరప్రదేశ్‌కు చెందిన రోహిత్.. తన మేనమామ గురూజీనీ కోరాడు. అతడు తన స్నేహితుడైన సుమన్ మాలిక్ వద్దకు పంపించాడు. తాను చెప్పిన చోటుకి గంజాయి చేరవేస్తే డబ్బులు ఇస్తానని చెప్పి యువకులతో అక్రమ రవాణా చేయించాడు సుమన్ మాలిక్.