టీ కాంగీల దుబ్బాక బై ఎలక్షన్ వ్యూహాలు

దుబ్బాక ఉప ఎన్నిక చారిత్రాత్మకమైనదిగా పేర్కొన్నారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ ఎన్నికను కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకుందని చెప్పారు. ఉపఎన్నికలో గెలిచేందుకు పార్టీ శ్రేణులు విభేదాలను..

టీ కాంగీల దుబ్బాక బై ఎలక్షన్ వ్యూహాలు
Follow us

|

Updated on: Sep 11, 2020 | 7:22 PM

దుబ్బాక ఉప ఎన్నిక చారిత్రాత్మకమైనదిగా పేర్కొన్నారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ ఎన్నికను కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకుందని చెప్పారు. ఉపఎన్నికలో గెలిచేందుకు పార్టీ శ్రేణులు విభేదాలను పక్కనపెట్టి, ఏకతాటిపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణను ఇప్పటికే ప్రారంభించామన్న ఉత్తమ్… పోటీ చేయబోయే అభ్యర్థిని త్వరలోనే ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు. మండల కమిటీలను మూడు రోజుల్లోగా పూర్తి చేయాలని డీసీసీ అధ్యక్షులను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను అన్ని విధాలుగా మోసం చేసిందని..ఈ విషయం ఇప్పటికే గ్రహించిన ఓటర్లు దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్ ను ఓడించడం ఖాయమని ఉత్తమ్ జోస్యం చెప్పారు. ఇందిరా భవన్‌లో జరిగిన దుబ్బాకా అసెంబ్లీ ఉప ఎన్నిక సన్నాహక సమావేశంలో ఉత్తమ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్‌ నేతలతోపాటు, దుబ్బాక నియోజకవర్గం నుండి కార్యకర్తలు, ముఖ్య నాయకులు హాజరై దుబ్బకకు సంబంధించిన ముఖ్యమైన సమస్యల గురించి చర్చించారు.