ఎన్నికల ఫలితాల వెల్లడికి వారాలు, నెలలు పట్టవచ్చు, ట్రంప్

నవంబరు 3 న జరిగే అధ్యక్ష ఎన్నికల ఫలితాల వెల్లడికి వారాలు, నెలలు పట్టవచ్ఛునని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉసూరుమన్నారు. పోస్టాఫీసులు, లోకల్ ఎలెక్షన్ సంస్థల్లో మెయిల్-ఇన్-బ్యాలెట్లు కుప్పలు, తెప్పలుగా పేరుకుపోవచ్ఛునన్న ఆందోళనను ఆయన వ్యక్తం చేశారు...

ఎన్నికల ఫలితాల వెల్లడికి వారాలు, నెలలు పట్టవచ్చు, ట్రంప్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Aug 22, 2020 | 12:15 PM

నవంబరు 3 న జరిగే అధ్యక్ష ఎన్నికల ఫలితాల వెల్లడికి వారాలు, నెలలు పట్టవచ్ఛునని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉసూరుమన్నారు. పోస్టాఫీసులు, లోకల్ ఎలెక్షన్ సంస్థల్లో మెయిల్-ఇన్-బ్యాలెట్లు కుప్పలు, తెప్పలుగా పేరుకుపోవచ్ఛునన్న ఆందోళనను ఆయన వ్యక్తం చేశారు. దీనివల్ల ఫలితాలు చాలా జాప్యం కావచ్ఛు అన్నారు. ఆ రోజున అసలు ఎలెక్షన్ కౌంట్ అన్న ప్రసక్తే ఉండదని, ఇది ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేమని పేర్కొన్నారు., నా  అభిప్రాయం ప్రకారం బహుశా ఫలితాల ప్రకటనకు వారాలు, నెలలు పట్టవచ్చు..  అసలు ఫలితం వెల్లడి కాకపోయినా ఆశ్చర్యం లేదు’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. కౌన్సిల్ ఆఫ్ నేషనల్ పాలసీ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. 50 మిలియన్ల ఓటర్ల మెయిల్-ఇన్-ఓట్ల లెక్కింపు చాలా ఆలస్యమయ్యే సూచనలు ఉన్నాయన్నారు. అందులోనూ ఈ కరోనా వైరస్ పాండమిక్ తరుణం కూడా ఇందుకు దోహదం చేస్తోందన్నారు.

ఈ ఎన్నికల్లో తన డెమొక్రాట్ ప్రత్యర్థి జో బిడెన్ కన్నా చాలా వెనుకబడి ఉన్న ట్రంప్.. ఫలితాలను తారుమారు చేసేందుకు డెమొక్రాట్లు దేశవ్యాప్తంగా మెయిల్-ఇన్-ఓటింగ్ ని మానిప్యులేట్ చేయడానికి యత్నిస్తున్నారని ఆరోపించారు. ఇది మన ప్రజాస్వామ్యానికి పెద్ద సమస్య అవుతుందన్నారు.

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో