Undavalli letter: విభజనచట్టాన్ని ఉల్లంఘించొద్దు..జగన్‌కు ఉండవల్లి లేఖ

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు మరో లేఖ రాశారు. ఈసారి ఓ భూమి విషయంలో కాస్త ఘాటైన లేఖతో తెరమీదికి వచ్చారు ఉండవల్లి. ఈ వారంలో జగన్‌కు ఉండవల్లి రాసిన మూడో లేఖ ఇది.

Undavalli letter: విభజనచట్టాన్ని ఉల్లంఘించొద్దు..జగన్‌కు ఉండవల్లి లేఖ
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 25, 2020 | 6:55 PM

Undavalli writes CM Jagan: మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు మరో లేఖ రాశారు. ఈసారి ఓ భూమి విషయంలో కాస్త ఘాటైన లేఖతో తెరమీదికి వచ్చారు ఉండవల్లి. ఇళ్ళ స్థలాల పేరిట సేకరిస్తున్న భూముల్లో విద్యాసంస్థలను టార్గెట్ చేయడం కరెక్టు కాదని ఉండవల్లి తన తాజా లేఖలో పేర్కొన్నారు.

రాజమండ్రిలో తెలుగు యూనివర్సిటీకి చెందిన 20 ఎకరాల స్ధలాన్ని స్వాధీనం చేసుకోవాలన్న తూర్పు గోదావరి జిల్లా కలక్టర్ నిర్ణయాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని తెలిపారు ఉండవల్లి. 1985లో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీ, తెలుగు విజ్ఞాన పీఠం నిర్మాణం 45 ఎకరాల స్ధలంలో జరిగిందని, అందులో గతంలో 25 ఎకరాలు నేక్ నిర్మాణాలకు తీసుకుందని లేఖలో వివరించారాయన.

తెలుగు రాష్ట్రాలలో తెలుగు యూనివర్శిటీకి మొత్తం అయిదు క్యాంపస్‌లు ఉన్నాయని, ఈ నేపథ్యంలో మొత్తం తెలుగు యూనివర్సిటీ ప్రాంగణాన్ని ఇళ్ల స్థలాల కోసం స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్ నిర్ణయించారని వివరించారు ఉండవల్లి.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 75ను ప్రభుత్వాలు తుంగలో తొక్కుతున్నాయని, విద్యాలయాలకు, యూనివర్శిటీలకు చెందిన ఏ భూమినీ కూడా గృహ నిర్మాణాలకు వాడరాదని వుండగా దాన్ని ఇపుడు ఉల్లంఘిస్తున్నారని అంటున్నారు ఉండవల్లి. 2014 కేంద్ర చట్టం 6లోని Xవ షెడ్యూల్‌లో ఐటెమ్ నంబరు 59 గురించి కలెక్టర్ పట్టించుకోలేదని వాదిస్తున్నారు ఈ మాజీ ఎంపీ.

జీఓ ఎంఎస్ నంబర్ 510కు, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 75కు వ్యతిరేకంగా కలెక్టర్ నిర్ణయం ఉందని, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ నిర్ణయాన్ని తక్షణం నిలిపి వేయాలని డిమాండ్ చేశారు ఉండవల్లి అరుణ్ కుమార్.

Read this: ఎమ్మెల్యేలకు కేసీఆర్ లిట్మస్ టెస్టు  KCR litmus test for MLAs

Scam: అర్జెంట్‌గా డబ్బులంటూ ధోనీ నుంచి మెసేజ్‌.. స్పందించారో..
Scam: అర్జెంట్‌గా డబ్బులంటూ ధోనీ నుంచి మెసేజ్‌.. స్పందించారో..
విదేశాల్లో చదువు కోసం టాయిలెట్స్ క్లీన్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు
విదేశాల్లో చదువు కోసం టాయిలెట్స్ క్లీన్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు
USలో భారత సంతతి విద్యార్ధిని అరెస్ట్‌! పాలస్తీనా అనుకూల నినాదాలు
USలో భారత సంతతి విద్యార్ధిని అరెస్ట్‌! పాలస్తీనా అనుకూల నినాదాలు
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే