ఇరుదేశాలు నిగ్రహంగా ఉండాలి: ఐరాస

ఐరాస: ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య నెలకొన్న తాజా పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరారు. సరిహద్దులో సాధారణ పరిస్థితులను నెలకొల్పడానికి రెండు దేశాలు కలిసి చర్యలు తీసుకోవాలన్నారు. కావాలంటే యూఎన్‌ నుంచి ఎటువంటి సహకారం అందించడానికైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పుల్వామా దాడితో రెండు దేశాల మధ్య సంబంధాలు ఆందోళనకర స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. 40 మంది జవాన్ల మృతికి పాకిస్థాన్‌ కారణమంటూ […]

ఇరుదేశాలు నిగ్రహంగా ఉండాలి: ఐరాస
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 6:49 PM

ఐరాస: ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య నెలకొన్న తాజా పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరారు. సరిహద్దులో సాధారణ పరిస్థితులను నెలకొల్పడానికి రెండు దేశాలు కలిసి చర్యలు తీసుకోవాలన్నారు. కావాలంటే యూఎన్‌ నుంచి ఎటువంటి సహకారం అందించడానికైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పుల్వామా దాడితో రెండు దేశాల మధ్య సంబంధాలు ఆందోళనకర స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. 40 మంది జవాన్ల మృతికి పాకిస్థాన్‌ కారణమంటూ భారత్‌ వాదిస్తుండగా.. దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ పాకిస్థాన్‌ చెప్పుకొస్తోంది. ఇప్పటికే దీనిపై ఇరు దేశాలు ఆయా రాయబారుల ముందు నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై యూఎన్‌లోని పాకిస్థాన్‌ అధికారులతో చర్చలు జరపడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు  గుటెరస్‌ అధికార ప్రతినిధి డుజార్రిక్‌ తెలిపారు.

ఐరాస మానవ హక్కుల మండలి హై కమిషనర్‌ మిచెల్లీ బకెల్ట్‌ సైతం దాడిని తీవ్రంగా ఖండించారు. దాడులకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. పింగ్లాన్‌లో జరిగిన దాడులపైనా ఆవేదన వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులపైనా వారు విచారం వ్యక్తం చేశారు. శాంతియుత వాతావరణంలో చర్చలు జరిపి పరిస్థితులను చక్కదిద్దుకోవాలని సూచించారు.

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో