బ్రెగ్జిట్ డీల్‌: రాజీనామా చేయనున్న థెరీసా మే

బ్రిటన్ ప్రధాన మంత్రి థెరీసా మే త్వరలో రాజీనామా చేయబోతున్నారు. బ్రెగ్జిట్‌ విషయంలో ఆమె వైఖరిపై తీవ్ర విమర్శలు రావడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ఆమె 10, డౌనింగ్ స్ట్రీట్ నివాసం వెలుపల మాట్లాడుతూ తాను ప్రధాన మంత్రి పదవికి వచ్చే నెల 7న రాజీనామా చేస్తానని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటన ముగిసిన తర్వాత రాజీనామా చేస్తానన్నారు. బ్రెగ్జిట్ డీల్‌ను మూడుసార్లు తిరస్కరించారని, దీనికి మద్దతివ్వాలని ఎంపీలకు నచ్చజెప్పడానికి చాలా […]

బ్రెగ్జిట్ డీల్‌: రాజీనామా చేయనున్న థెరీసా మే
Follow us

| Edited By:

Updated on: May 24, 2019 | 8:20 PM

బ్రిటన్ ప్రధాన మంత్రి థెరీసా మే త్వరలో రాజీనామా చేయబోతున్నారు. బ్రెగ్జిట్‌ విషయంలో ఆమె వైఖరిపై తీవ్ర విమర్శలు రావడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ఆమె 10, డౌనింగ్ స్ట్రీట్ నివాసం వెలుపల మాట్లాడుతూ తాను ప్రధాన మంత్రి పదవికి వచ్చే నెల 7న రాజీనామా చేస్తానని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటన ముగిసిన తర్వాత రాజీనామా చేస్తానన్నారు.

బ్రెగ్జిట్ డీల్‌ను మూడుసార్లు తిరస్కరించారని, దీనికి మద్దతివ్వాలని ఎంపీలకు నచ్చజెప్పడానికి చాలా కృషి చేశానని, అయినప్పటికీ ఫలితం లేకపోయిందని థెరీసా మే చెప్పారు. వచ్చే నెల 3న పటిష్టమైన బ్రెగ్జిట్ డీల్‌ను ప్రవేశపెడతానని థెరీసా గత వారం హామీ ఇచ్చారు. దీనిపై ఇతర పార్టీలతోపాటు సొంత పార్టీ కూడా తీవ్ర విమర్శలు గుప్పించడంతో ఆమె తన పదవికి రాజీనామా చేయడానికి నిర్ణయించుకున్నారు. 2016 జూలైలో థెరీసా ప్రధాన మంత్రి పదవిని చేపట్టారు. వచ్చే నెల 7న ఆమె రాజీనామా తర్వాత ప్రధాన మంత్రి పదవి కోసం జరిగే రేసులో బోరిస్ జాన్సన్ ముందు వరుసలో ఉంటారని తెలుస్తోంది.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు