Breaking News
  • ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. రాష్ట్ర నోడల్‌ ఆఫీసర్‌ రాంబాబు టీవీ9 గుడ్‌మార్నింగ్ ఇండియాలో చెప్పినట్టుగానే పాజిటివ్‌ కేసులు బాగా పెరుగుతున్నాయి.
  • ప్రభుత్వ ఉద్యోగుల జీతాలలో కోత పెట్టి కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడం కరెక్ట్‌ కాదంటున్నారు తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడు. అధికారం ఉందని ఇష్ట ప్రకారం చేస్తామనడం సబబు కాదన్నారు.
  • కరోనా భూతాన్ని తరిమికొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది.. . ఇవాళ భేటి అయిన కేంద్ర కేబినెట్‌ ఇందుకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా మహమ్మారిపై యుద్ధం చేయడానికి నిధుల కొరత ఉండకూడదన్న ఉద్దేశంతో పార్లమెంట్‌ సభ్యుల వేతనాల్లో 30 శాతం కోత విధించారు.. ఏడాది పాటు కోత ఉంటుంది.
  • కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా కొన్నిచోట్ల ప్రభుత్వ ఆదేశాలను అధికారులు బేఖాతరు చేస్తున్నారు. విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తిరునాళ్లను తలపిస్తోంది.
  • ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలలో అకాలవర్షం భయపెడుతోంది. కర్నూలు, మహబూబ్‌నగర్‌ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతాల్లో జోరుగా వానపడింది. ఇటు వికారాబాద్‌ జిల్లా పర్గితో పాటు రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోనూ వర్షం కురిసింది. వేసవి కాలంలో పడుతున్న ఈ అకాలవర్షంతో జనం బెంబేలెత్తారు.
  • కరోనా వైరస్‌ నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. కర్నూలు జిల్లాలో కరోనా ల్యాబ్‌ ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. టెలీ మెడిసిన్‌ అందుబాటులోకి తెస్తున్నామన్నారు. లాక్‌డౌన్‌ సడలింపు కేంద్రమే నిర్ణయించాలంటున్నారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి.

అయోమయంలో ఈ ఇద్దరు..ఎందుకంటే?

two mla under confusion, అయోమయంలో ఈ ఇద్దరు..ఎందుకంటే?

రాజధానిని మూడుగా విభజించటం ఏపీలో రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. రాజధానిలో ప్రజాప్రతినిధులు ప్రజల వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. తాడికొండ, మంగళగిరి ఎమ్మెల్యేల పరిస్థితి ముందు నుయ్య వెనుక గొయ్యి అన్నట్టుగా మారింది.
ఏపీ రాజధాని అమరావతిని, తాడికొండ నియోజకవర్గంలోని తుళ్లూరు కేంద్రంగా ఏర్పాటుచేశారు. ఇక మంగళగిరిలోని కొన్ని గ్రామాలను సీడ్‌ కాపిటల్‌లో కలిపారు. దీంతో రెండు నియోజకవర్గాల్లోనూ రాజధాని విస్తరించింది.
ప్రస్తుతం రాజధానిని మూడుగా విభజించే ప్రతిపాదనలపై రెండు నియోజకవర్గాల్లోని జనంలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. రాజధానిలోని 29 గ్రామాల ప్రజలు ఆందోళన బాట పట్టారు. ఈ నేపథ్యంలోనే ఈ రెండు నియోజకవర్గాలలోని అధికారపార్టీ ఎమ్మెల్యేలు ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. తాడికొండ ఎస్సీ రిజర్వుడ్‌ నియోజకవర్గం. అక్కడి నుంచి డాక్టర్‌ ఉండవల్లి శ్రీదేవి గెలుపొందారు. రాజధాని ప్రాంతంలో టీడీపీ ఓడిపోవడం సంచలనం సృష్టించింది. మొదటిసారి గెలుపొందిన శ్రీదేవి అన్ని మండలాల్లో పర్యటిస్తూ ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లోనూ చురుకుగా పాల్గొని తన గళాన్ని వినిపించారు.
అయితే అసెంబ్లీ సమావేశాల చివరిరోజున సిఎం జగన్‌, రాజధానిని విభజించి మూడు చోట్లకు తరలించే అవకాశం ఉందని చెప్పటంతో ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. 29 గ్రామాల జనం రోడ్డుపైకి వచ్చారు. దీంతో ఎమ్మెల్యే శ్రీదేవి కనీసం రైతుల దగ్గరకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించలేక ఇటు రైతులకు నచ్చచెప్పలేక ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఆమె తుళ్లూరు మండలంవైపు వెళ్లడం లేదు. గత ఎన్నికల్లో ఈ మండలంలో టీడీపీ అభ్యర్థికి 7 వేల ఓట్ల మెజారిటీ వచ్చింది. రాజధానిని పూర్తిగా ఇక్కడే ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ప్రజలనుంచి తీవ్ర వ్యతిరేకత రావటంతో రాజధానిపై మౌనమే సమాధానమన్నట్టు వ్యహరిస్తున్నారు.
ఇక మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పరిస్థితి కూడా కూడా అదే విధంగా ఉంది. గత ప్రభుత్వం నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకించిన ఆర్కే ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయంపై మౌనంగా ఉండిపోయారు. పరిపాలన రాజధానిని తరలించాలన్న ప్రతిపాదనను జనం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయినా ఆర్కే మౌనంగా ఉండిపోతున్నారు. దీంతో అక్కడి టీడీపీ కూడా ఆయనపై ఎదురుదాడి మొదలుపెట్టింది. ఆర్కే కనిపించటం లేదంటూ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు టిడిపి నేతలు. మంగళగిరి మండలంతో పాటు, తాడేపల్లిలోని మరికొన్ని గ్రామాలు సీడ్‌ క్యాపిటల్‌ పరిధిలోనే ఉన్నాయి. గతంలో రాజధానిలో అవినీతి జరిగిందని గట్టిగా మాట్లాడిన ఆర్కే.. ప్రజల ఆగ్రహావేశాలు చల్లారే వరకూ మౌనంగా ఉండాలని భావిస్తున్నారు.
మొత్తం మీద ఈ రెండు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మున్ముందు సర్కారు నిర్ణయం ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. ప్రజల ముందుకు ఎలా వెళ్లాలో తెలియడంలేదు. మరోవైపు రాజధాని మార్పుపై ప్రజాభిప్రాయాన్ని కోరాలని టీడీపీ డిమాండ్‌ చేస్తోంది. ఎన్నికల ముందు రాజధానిని మార్చం అని మేనిఫెస్టోలో ప్రకటించటం వల్లే ఈ రెండు చోట్ల వైసీపీ గెలిచిందని టీడీపీ నేతలు అంటున్నారు. రాజధానిని మార్చిన తర్వాత, గుంటూరు జిల్లాలోని 15 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ప్రజాభిప్రాయం కోరాలని టీడీపీ చేస్తున్న డిమాండ్‌తో ఈ ఇద్దరూ మరింత సంకటంలో పడ్డారు.

Related Tags