పాక్ అధ్యక్షుడికి ట్విట్టర్ నోటీసులు

పాక్ అధ్యక్షుడు అరిఫ్ అల్వీకి ట్విటర్ షాక్ ఇచ్చింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్ ,పాక్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. అయితే పాక్ అధ్యక్షుడు అరిఫ్ పోస్ట్ చేసిన వీడియోలు భారతీయ చట్టాల్నిదెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ నోటీసులు పంపింది ట్వీటర్. ఈ విషయాన్ని పాక్ మానవహక్కుల మంత్రి షిరీన్ మజారీ వెల్లడించారు. ట్విటర్ నోటీసులపై ఆయన స్పందిస్తూ చాలా హాస్యస్పదంగా ఉందంటూ విమర్శించారు. కశ్మీర్ నిరసనలకు సంబంధించి జరిగిన ఓ ర్యాలీకి […]

పాక్ అధ్యక్షుడికి ట్విట్టర్ నోటీసులు
Follow us

| Edited By:

Updated on: Aug 27, 2019 | 10:10 AM

పాక్ అధ్యక్షుడు అరిఫ్ అల్వీకి ట్విటర్ షాక్ ఇచ్చింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్ ,పాక్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. అయితే పాక్ అధ్యక్షుడు అరిఫ్ పోస్ట్ చేసిన వీడియోలు భారతీయ చట్టాల్నిదెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ నోటీసులు పంపింది ట్వీటర్. ఈ విషయాన్ని పాక్ మానవహక్కుల మంత్రి షిరీన్ మజారీ వెల్లడించారు. ట్విటర్ నోటీసులపై ఆయన స్పందిస్తూ చాలా హాస్యస్పదంగా ఉందంటూ విమర్శించారు. కశ్మీర్ నిరసనలకు సంబంధించి జరిగిన ఓ ర్యాలీకి సంబంధించి ఓ వీడియోను అరిఫ్ అల్వీ ట్వీటర్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో భారతీయ చట్టాలను ఉల్లంఘించినట్టుగా ఉందని నోటీసులు జారీ చేసింది.